8 ప్రభుత్వాలు కూల్చారట, నాలుగింటిని పడగొడతారట, చూస్తూ కూర్చొవాలా: కేసీఆర్
ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపినా ఫుటేజీని సీఎం కేసీఆర్ మీడియాకు చూపించారు. 3 గంటల వీడియోను గంటపావు కుదించామని వివరించారు. హైదరాబాద్ వచ్చి తమ ప్రభుత్వం కూలుస్తామని అమిత్ షా ఎలా అంటారని అడిగారు. గత నెలలో రామచంద్రా భారతి హైదరాబాద్ వచ్చారని గుర్తుచేశారు. తుషార్.. అనే వ్యక్తి వాయనాడులో రాహుల్ గాంధీ మీద పోటీ చేశారని తెలిపారు. అతనికి టికెట్ ఇచ్చిందే అమిత్ షా అని తెలిపారు.

ప్రణమిల్లుతున్న..
న్యాయవ్యవస్థకు చేతులు జోడించి వేడుకుంటున్నా.. న్యాయం చేయాలని కోరారు. వారు పేరు మఠాధిపతులు.. చేసేది దుర్మార్గపు పనులు అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం 12 వేల కోట్ల ఖర్చు చేశాం అని తెలిపారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలు, మేధావులేనని కేసీఆర్ స్పష్టంచేశారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాలను ఎలా కూల్చారో వివరించారు.
అలహాబాద్ హైకోర్టు అలా..
తమకు న్యాయం చేయాల్సింది జ్యుడిషీయరీ సిస్టమ్ అని తెలిపారు. అలహాబాద్ హై కోర్టు.. ఇందిరాగాంధీ ఎన్నికపై తీర్పు గురించి ప్రస్తావించారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చితే పార్టీలకు అతీతంగా పోరాడతామని గుర్తుచేశారు. ఆ వీడియోలో అమిత్ షా పేర్లు 20 సార్లు చెబుతారని వివరించారు. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. తమకు జిల్లాలవారీ లిస్ట్ ఉందని.. నేతలు టచ్‌లో ఉన్నారని ఎలా చెబుతారని పేర్కొన్నారు. హుజురాబాద్, దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిందన్నారు. నాగార్జున సాగర్, హుజూర్ నగర్‌లో గెలిచిందని కేసీఆర్ తెలిపారు.

8 ప్రభుత్వాలు కూల్చారట..
రామచంద్ర భారతి- రోహిత్ రెడ్డితో మాట్లాడారని.. 3 గంటల వీడియో ఉందన్నారు. 8 ప్రభుత్వాలు కూలగొట్టాం.. 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమయ్యం అయ్యాయని చెప్పారని తెలిపారు. ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రా, రాజస్తాన్‌లో 21 మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపామని కేసీఆర్ వివరించారు. అక్కడ వారు మౌనంగా ఉన్నందున.. బయటపడ్డారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు అలా లేదన్నారు.

రాజ్యాంగేతర శక్తులు
ఈడీ, ఇన్ కం టాక్స్ పేరు ఎలా చెబుతారని కేసీఆర్ అడిగారు. ఆ ముఠా చిన్నది కాదు.. 24 మందిమి ఉన్నారట అన్నారు. వారికి ఆధార్ కార్డ్ 3,4 ఉంటాయని తెలిపారు. ప్యాన్ కార్డ్ కూడా 3 ఉంటాయని తెలిపారు. పేర్లు మారతాయని వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా 3 ఉంటాయన్నారు.
కేజ్రీవాల్‌ను అలర్ట్ చేశానని కేసీఆర్ గుర్తుచేశారు. నుగోడులో ఈసీ విఫలమైందని విమర్శలు చేస్తున్నారని ఫైరయ్యారు. ఈసీ వారికి అనుకూలంగా పనిచేయాలా అని అడిగారు. గత 45 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నామని తెలిపారు. అంతేకాదు పాల్వాయి స్రవంతి తనను కలిసినట్టు దుష్ఫ్రచారం చేశారని మండిపడ్డారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications