హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆశ్చర్యం... అద్భుతం... యాదాద్రి భువనగిరిలో టోర్నడో.. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ..

|
Google Oneindia TeluguNews

అమెరికాలో ఎక్కువగా కనిపించే టోర్నడోలు భారత్‌లో ఎక్కడో చోట అరుదుగా కనిపిస్తుంటాయి. అమెరికాలో కనిపించే టోర్నడోల మాదిరిగా ఇవి అంతగా భీభత్సం సృష్టించవు. తాజాగా యాదాద్రి భువనగరి జిల్లాలో నేల నుంచి ఆకాశాన్ని తాకేలా ఓ టోర్నడో ఉవ్వెత్తున ఎగసిపడింది.

వలిగొండ మండలంలోని నెమలి కాల్వ,నాగారం గ్రామాల మధ్య ఉన్న మూసీ నది కాల్వ కత్వాపై ఈ దృశ్యం కనిపించింది. నీటిపై ఏర్పడ్డ సుడిగుండం... నీళ్లతో పాటే సుడులు సుడులుగా తిరుగుతూ ఆకాశంలోకి ఎగసింది. నేల పైనుంచి ఆకాశంలోని మేఘాలను తాకేలా నీళ్లు అంతెత్తున సుడులు సుడులుగా పైకి ఎగసిపడటం స్థానికులను అబ్బురపరిచింది. అదే సమయంలో ఒకింత ఆందోళనకు కూడా గురిచేసింది.

Tornado in Yadadri-Bhongir district videos gone viral

పరిసర గ్రామాల్లోని ప్రజలు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో... ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. సాధారణంగా సముద్ర తీరాల్లో,నదీ సంగమ ప్రాంతాల్లో ఇలాంటివి చోటు చేసుకుంటాయి. అలాంటిది మూసీ కాల్వపై ఇలాంటి దృశ్యం కనిపించడం పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

తల్లిదండ్రులని ఒకే రోజు లో కోల్పోయిన యువకుడు | Private Hospitals దుర్మార్గం || Oneindia Telugu

టోర్నడో వల్ల పెద్దగా నష్టమేమీ సంభవించనప్పటికీ.. సమీపంలోని కొన్ని చిన్న చెట్లు వేళ్లతో సహా పెకిలించివేయబడ్డాయి. సాయంత్రం 6.20గం. సమయంలో సంభవించిన టోర్నడో దాదాపు ఒక గంట పాటు కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ ప్రత్యక్ష సాక్షి దీనిపై మాట్లాడుతూ.... మొదట లింగరాజుపల్లిలోని చెరువులో అది ఏర్పడిందని... ఆ తర్వాత 15 నిమిషాలకు నెమలి కాలువ వైపు మళ్లిందని అన్నారు. నెమలి కాలువ వైపు వెళ్లే క్రమంలో క్రమంగా దాని తీవ్రత పెరగడంతో స్థానికులు ఒకింత భయాందోళనకు గురైనట్లు చెప్పారు.

English summary
People in several villages around Nemali Kaluva and Nagaram in Valigonda stood mesmerised for over an hour watching a tornado developing on Friday evening. Surprised villagers did not lose much time in filming the not-so-common weather phenomenon and the footage went viral on social media platforms in no time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X