ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ ఆ భయంతోనే: బీజేపీకి పావుగా అంటూ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఫైర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఐపీఎస్, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ. ఉద్యోగం పోయే పరిస్థుల్లో ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నారని ఆరోపించారు.

ఆ భయంతోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్..

ఆ భయంతోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్..

అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్న ప్రవీణ్ కుమార్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దళిత జాతిని పైకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని.. ప్రవీణ్ కుమార్ కూడా వాటిల్లో పాలుపంచుకున్నారని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఒక్క రూపాయి దళితుల కోసం పనిచేయలేదని కిశోర్ విమర్శించారు. ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నంచడం లేదని నిలదీశారు. ఎందుకంటే.. ఐపీఎస్ అధికారిగా ఉండి.. ఇష్టం వచ్చిన ప్రమాణాలు చేయించి.. ఇష్టారీతిన వ్యవహరిస్తే కేసులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో ఉద్యోగం ఉంటుందో.. పోతుందోనన్న భయాందోళనతో జాతి కోసం బయటకు వస్తున్నట్లు ప్రకటించారని కిశోర్ విమర్శించారు.

కేంద్రాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించలేరు..ఎందుకంటే?

కేంద్రాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించలేరు..ఎందుకంటే?

'మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా అంటే.. ఏమవుతోందనన్న భయం ఆయనలో ఉంది. ఇది గమనించాలని తెలంగాణ జాతిని కోరుతున్నా. ప్రతి పదేళ్లకోసారి ఇలాంటి వాళ్లు బయలుదేరుతారు. దళితజాతి బాగుపడుతుంటే వాళ్లను ఆగం చేసి, గందరగోళం చేయాలని చూస్తారు' అని గాదరి కిషోర్ ధ్వజమెత్తారు. దళితులకు ప్రమోషన్స్, ఉద్యోగాలు, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ చేస్తున్నారని కిశోర్ తెలిపారు. ఎప్పటికైనా విజయం సాదించేది ప్రజలేనని కేసీఆర్ అంటారు.. సందర్భాన్ని బట్టి ఎవరిని నమ్మాలి.. ఎవరికి చురకలు పెట్టాలో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. గతంలో చాలా మంది అధికారులు పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారని కిశోర్ అన్నారు.

బీజేపీకి పావుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కారు జోరు ఖాయం

బీజేపీకి పావుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కారు జోరు ఖాయం

ఇలాంటి పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజల కోసం ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం.. మీరు బీజేపీ ప్రయోగిస్తున్న కుట్రలో భాగంగా వస్తున్నారు. వాళ్లు మిమ్మల్ని పావుగా వాడుతున్నారు. దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసే దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని ప్రవీణ్ కుమార్ గ్రహించాలి. దళిత బంధులాంటి కార్యక్రమాలు చేపడుతున్న కేసీఆర్ ను విమర్శించడం సిగ్గుచేటు. త్వరలోనే మీకు కనువిప్పు కలుగుతుంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కారు విజయం ఖాయమని కిశోర్ ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ సర్కారుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలు

కేసీఆర్ సర్కారుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలు


కాగా, ఆదివారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరిన విషయం తెలిసిందే. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను రాంజీ గౌతమ్ ప్రకటించారు. బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏళ్ల తరబడి అలాగే ఉన్న అసంపూర్తి ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఎస్పీ ద్వారా న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారని వ్యాఖ్యానించారు. రెక్కాడితే గానీ డొక్కాడని వారి కోసమే పదవి వదులుకున్నట్లు చెప్పారు. దళితులు, గిరిజనుల బతుకులు బాగుపడాలంటే విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. బహుజన సమాజంలో బానిసలుగా ఎవరూ ఉండరని, కేవలం పాలకులే ఉంటారన్నారు. మరోవైపు కేసీఆర్ సర్కారుపైనా విమర్శలు గుప్పించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. టీఆర్ఎస్ సర్కారుపై ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చే రూ. వెయ్యి కోట్లు ఎవరి డబ్బులని ప్రశ్నించారు. కేసీఆర్‌కు దళితులపై ప్రేమ ఉంటే.. ఆయన ఆస్తులను అమ్మేసి డబ్బులు ఖర్చు చేయాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు వారి కష్టార్జితాన్ని వారే నిర్ణయించుకునేలా చేయాలని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. విచ్చలవిడిగా డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? అంటూ కేసీఆర్‌ను ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇచ్చే రూ. వెయ్యి కోట్లు ఎవరి డబ్బులు? అని నిలదీశారు. గిరిజన, ఆదవాసీ బిడ్డలు సాగు చేసిన డబ్బులే ఇచ్చారన్నారు. తమ కష్టార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. దళిత, గిరిజనులపై ప్రేమ ఉంటే కేసీఆర్ సంపాదించిన సంపాదించిన సొమ్ము ఇవ్వాలన్నారు. పేదలకు వైద్యం, విద్య, ఉపాధి నైపుణ్యం కావాలన్నారు. గురుకుల పాఠశాలల ద్వారా కేవలం 4 లక్షల మందికే విద్య అందుతోందని, 35 లక్షల మంది విద్యార్థులను వదిలేశారన్నారు. పేదలు చదివే వర్సిటీల్లో 3-4 ఏళ్లుగా నియామకాలు లేవన్నారు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. మరి ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదు? అని ఆర్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రజల జీవితాలను బాగు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరడంతో తెలంగాణలో మరో పార్టీ క్రియాశీలకంగా మారనుందనే చెప్పాలి. ఇప్పటికే వైఎస్ షర్మిల తన పార్టీని ఏర్పాటు చేసి విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+