Healht Camp: ఫ్రీ హెల్త్ క్యాంప్.. పరీక్షలు కూడా చేస్తున్నారు.. హైదరాబాద్‍లోనే.. కానీ..!
మహిళా జర్నలిస్టుల కోసం ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసింది.హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ ఐఅండ్పీఆర్ ఆఫఈస్ లో ఉచిత వైద్య శిబిరాన్ని సీఎస్ శాంతి కుమారి ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరం మార్చి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరంలో మహిళా జర్నలిస్టులు వెళ్లొచ్చు. అవసరమైన పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు సీఎస్ చెప్పారు. 35 ఏళ్ల దాటి ప్రతి మహిళా జనరల్ చెకప్ చేయించుకోవాలని శాంతి కుమారి సూచించారు. అక్రిడేషన్ ఉన్న వారు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పని చేసే మహిళ జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరానికి రావొచ్చిని చెప్పారు.

వైద్య శిబిరంలో రక్త పరీక్ష (C.B.P) , బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బి12, డి3 మొదలైన డయాగ్నోస్టిక్స్ పరీక్షలు , ఈసీజీ (ECG), ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మియర్, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, కంటి స్క్రీనింగ్ , దంత పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైన పరీక్షలు చేస్తున్నారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications