• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ తెరపైకి మరియమ్మ లాకప్‌డెత్ కేసు: సీబీఐ విచారణ జరపాలంటూ హైకోర్టు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అడ్డగూడురు లాక్‌డెత్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పీయూసీఎల్ పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. మరియమ్మ మృతిపై హైకోర్టుకు అందిన నివేదికపై ఆధారంగా మరియమ్మ లాకప్‌డెత్ కేసును సీబీఐకి అప్పగించదగినదని అభిప్రాయపడింది.

అంతేగాక, నవంబర్ 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు అప్పగించాలని ఏజీని ఆదేశించింది. లాకప్‌లో ఉన్న సమయంలో మరియమ్మ చనిపోవడానికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది హైకోర్టు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఎస్ఐ, కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఏజీ ధర్మాసనానికి వివరించారు.

TS high court bench suggests cbi probe on mariyamma lockup death case.

ఇక, మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున నష్ట పరిహారం చెల్లించినట్లు ఏజీ పేర్కొన్నారు. అయితే, పరిహారం ఇస్తే పోయిన మరియమ్మ ప్రాణం తిరిగి తీసుకురాలేనిదని హైకోర్టు ధర్మాసనం ఘాటుగా స్పందించింది. మరియమ్మకు ఇతర అనారోగ్య సమస్యలు ఉండటం వల్లే హార్ట్ ఎటాక్‌తో చనిపోయినట్లు అడ్వకేట్ జనరల్ చెప్పిన సమాధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

రెండో పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మృతురాలి శరీరంపై గాయాలున్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. లాకప్‌లో ఉన్న మహిళను గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా? అంటూ నిలదీసింది హైకోర్టు ధర్మాసనం. అందుకే ఈకేసును సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమంది. సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఈ కేసు విచారణను నవంబర్ 22కి వాయిదా వేసింది.

తెలంగాణలో 9 మంది జడ్జీల బదిలీలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది జడ్జీల బదిలీలు జరిగాయి. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు జడ్జిగా ఈ.తిరుమల దేవి, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా వై. రేణుక, రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్ట్‌గా సీహెచ్‌కే భూపతి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఎం.వి. రమేశ్‌, నిజామాబాద్‌ జిల్లా ప్రిన్సిపల్‌, సెషన్స్‌ జడ్జిగా కుంచాల సునీత, నల్గొండ జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జిగా బి.ఎస్‌. జగ్జీవన్‌ కుమార్‌, ఆదిలాబాద్‌ జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జిగా రామకృష్ణ సునీత, సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా వి.బి. నిర్మల గీతాంబ, రాష్ట్ర వ్యాట్‌ అప్పేలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్‌ పర్సన్‌గా జి. అనుపమ చక్రవర్తి లను జడ్జీలుగా బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది.

English summary
TS high court bench suggests cbi probe on mariyamma lockup death case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X