హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు కేంద్రం చేసింది ‘సున్నా’: కేంద్రం, మోడీపై కేటీఆర్ ట్వీట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నరేంద్ర మోడీ ఎన్ని వైద్య కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం తెలంగాణలో వైద్య విద్య విషయంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.

Recommended Video

BJP VS KTR చెప్పులు మోయడానికి బిజెపి నాయకుల మధ్య తీవ్రమైన పోటీ *Politics

గత ఎనిమిదేళ్లలో కేంద్రం ఎన్ని మెడికల్ కళాశాలలు మంజూరు చేసిందో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని ఐటీశాఖమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గత 67 ఏళ్ల కాలంలో కేవలం 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే తెలంగాణలో ఏర్పాటయ్యాయని తెలిపారు. వైద్య విద్యలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప చరిత్ర లిఖించారని మంత్రి కేటీఆర్ అన్నారు.

TS minister ktr asks pm modi about medical colleges in sanctioned to telangana

అధికారంలో వచ్చిన ఎనిమిదేళ్లలోనే 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కేంద్రాన్నిప్రశ్నించారు కేటీఆర్. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రకారం ప్రభుత్వం మరో 13 కళాశాలలు ఏర్పాటు చేయనన్నట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే సంగారెడ్డిలో వైద్య కళాశాల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందని ప్రకటించారు.

అలాగే, మహబూబ్‌నగర్‌లో వైద్య కళాశాల నిర్మాణం కూడా దాదాపు చివరిదశకు చేరుకుందని తెలిపారు. వనపర్తి, రామగుండం, జగిత్యాల మెడికల్ కాలేజీల నిర్మాణం కూడా దాదాపు పూర్తయినట్లు కేటీఆర్ వెల్లడించారు.

నాగర్‌ కర్నూలు మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా దాదాపు పూర్తైందని కేటీఆర్ తెలిపారు. సూర్యాపేట, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండ వైద్య కళాశాలలు పనిచేయడం ప్రారంభమయ్యాయని అన్నారు. త్వరలో కొత్తగూడెం వైద్య కళాశాల ప్రారంభోత్సవం చేసుకోబోతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

English summary
TS minister ktr asks pm modi about medical colleges in sanctioned to telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X