ప్రేయసి కోసం రూ. 6 లక్షలకు డీఏవో పేపర్ కొనుగోలు: టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేపర్ లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేయగా.. శుక్రవారం లౌకిక్, సుస్మిత అనే ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.

లౌకిక్ అనే వ్యక్తి తన ప్రేయసి సుస్మిత కోసం డీఏఓ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశారు. ప్రవీణ్ నుంచి లౌకిక్.. డీఏవో పరీక్ష ప్రశ్నపత్రాన్ిన కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. కస్టడీలో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

TSPSC paper leakage case

ప్రియురాలు సుస్మిత కోసం లౌకిక్.. డీఏఓ పేపర్‌ను రూ. 6 లక్షలకు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రవీణ్ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించడంతో బయటపడ్డ ఇద్దరి వ్యవహారం బయటపడింది. రూ. 6 లక్షల అనుమానాస్పద లావాదేవీలు గుర్తించి సిట్ కూలిలాగడంతో లౌకిక్, సుస్మిత వ్యవహారం బయటపడింది.

ఫిబ్రవరి 26వ తేదీన నిర్వహించాల్సిన డీఏఓ పరీక్షను.. లీకేజీ వ్యవహారం నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. సిట్ దర్యాప్తులో రోజు రోజుకు కొత్త వ్యవహారాలు బయటపడుతుండటం గమనార్హం. పేపర్ లీకేజీ కేసులో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక నుంచి సీజ్ చేసిన సెల్‌ఫోన్లను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అధికారులు పంపించారు. ప్రవీణ్, రాజశేఖర్ లాప్టాప్, సిస్టమ్స్‌ను కూడా అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఏప్రిల్ 11న కోర్టులో కేసు నివేదికను సిట్ సమర్పించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+