టీఎస్ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికులు, అధికారులు మంచోళ్లు : సీఎం కేసీఆర్
ఆర్టీసీ కార్మికులు, అందులో పని చేసే అధికారులు అందరు మంచోల్లేనని , సీఎం కేసీర్ కితాబు ఇచ్చారు. అధికారులతోపాటు కార్మికుల కష్టానికి అనేక అవార్డులు కూడ వచ్చాయని సీఎం చెప్పారు. అయితే వచ్చిన చిక్కంతా యూనియన్లతోనే అని అన్నారు. యూనియన్ల వల్ల ఆర్టీసీ సంస్థలు చాల నష్టాల్లోకి వెళ్లాయని చెప్పారు. ఇలా యూనియన్లతోనే ఇతర రాష్ట్రాల్లోని ఆర్టీసీ సర్వనాశనమైందని అన్నారు.
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ యూనియన్ల ఆర్టీసి మనుగడ సాధించడం కష్టసాధ్యమేనని అన్నారు .తనకు ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లతో ఎలాంటీ పంచాయితీ లేదని అన్నారు. మరోవైపు యూనియన్ల పేరుతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీని బతికి బట్టకుండా చేశారని చెప్పారు. ఇందుకు ఉదహారణగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితిని వివరించారు. ఒకనాడు వెలుగువెలిగిన పశ్చిమబెంగాల్ యూనియన్ల వల్ల పెట్టుబడిదారులు పారిపోయారని అన్నారు. మొత్తం మీద యూనియన్లే అన్ని సమస్యలకు మూలకారణంగా సీఎం పేర్కోన్నారు.

ఈ నేపథ్యంలోనే మాట్లాడిన సీఎం ఆర్టీసీ సమ్మెతో సంస్థ లేకుండా పోతుందని చెప్పారు. సంస్థను ఎవ్వరు వచ్చినా కాపాడలేదని దుస్థితికి చేరిందని చెప్పారు. ఇప్పటికే నాలుగువేల అయిదువందల కోట్ల రుపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చిందని అన్నారు.












Click it and Unblock the Notifications