హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సీఎం గ్రీన్ సిగ్నల్

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మెపై సానుకూల పవనాలు ఏర్పడ్డాయి. కార్మికులతో చర్చలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం ఉదయం 11 గంటలకు అధికారుల బృందం చర్చలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేశారు. అయితే చర్చలు బస్‌భవన్, లేదా రవాణాశాఖ కార్యాలయంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాని హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే.

ఆర్టీసీ సమస్యలపై ఈడీ అధికారుల నివేదిక

ఆర్టీసీ సమస్యలపై ఈడీ అధికారుల నివేదిక

కోర్టు ఆదేశాలతో సమస్యపై అధ్యయనం చేసేందుకు సీఎం కేసీఆర్ ఈడీ అధికారుతో కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో సమస్యలపై రెండు రోజులపాటు విసృతంగా చర్చించిన అధ్యయన కమిటీ నివేదికను అధికారులు సీఎం కేసీఆర్‌కు అందించారు. దీంతో అధికారులు ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో మరోసారి సమీక్ష సమావేశం సుదీర్ఘంగా నిర్వహించారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మ కూడ పాల్గోన్నారు. ఈనేపథ్యంలోనే చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కోర్టు ఆదేశాలతో కదిలిన ప్రభుత్వం

కోర్టు ఆదేశాలతో కదిలిన ప్రభుత్వం


సమ్మెపై హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికులు పెట్టిన డిమాండ్లలో అమలుకు సాధ్యమయ్యో 21 డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి చర్చలు జరపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు సానుకూల వాతవరణం ఏర్పరచి సమస్యను పరిష్కరించేందుకు చర్చలు చేపట్టాలని కోర్టు సూచిచింది. అనంతరం కేసును 28 వాయిదా వేసింది. దీంతో సీఎం కేసీఆర్ వాటి పరిష్కారానికి ఈడీలతో కూడిన కమిటీ వేశారు. కోర్టు సూచించినట్టుగా 21 డిమాండ్లతోపాటు కార్మికులు నోటీసులో ఇచ్చిన మొత్తం 45 డిమాండ్లపై కూడ చర్చలు కొనసాగనున్నాయి.

చర్చలతో ముగుస్తుందా లేక కోర్టుకు వెళతారా

చర్చలతో ముగుస్తుందా లేక కోర్టుకు వెళతారా

మరోవైపు కార్మికులతో చర్చలతో పాటు కోర్టుకు సమాధానం చేప్పేందుకు కూడ అధ్యయన కమిటీ రెండు రకాల నివేదికలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రతి అంశానికి రెండు రకాల సమాధానాలు అధికారులు సిద్ధం చేసినట్టు సమాచారం. కోర్టుకు సమగ్ర వివరాలు అందించేలా కమిటీ సభ్యులు రిపోర్టు తయారు చేశారు. ఈ నివేదికను 28న జరిగే విచారణలో ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించనుంది. కాగా సీఎం కేసీఆర్ విలీనంతో పాటు పలు అంశాలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.. కార్మికులు మొండిపట్టుదలకు పోతే ఆర్టీసీ మనుగడ కష్టమని కుండబద్దలు కొట్టారు. దీంతోపాటు జీతాలకు సంబంధించి కూడ ఆర్టీసీ వద్ద డబ్బులు లేవనే విషయాన్ని స్ఫష్టం చేశారు. ఇదే వాదనలు కోర్టులో కూడ వినిపించే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఆర్టీసీ కార్మికులతో జరిగే చర్చలు సఫలం కానిపక్షంలో, 28వ తేదీన కోర్టులో జరిగే వాదనలపై ఆర్టీసీ భవితవ్యం తేలనుంది.

English summary
RTC strike. CM KCR gave green signal for discussions with the RTC unions.negociants will be held on saturday at Bus Bavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X