హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ కొత్త బిజినెస్- రేపే ప్రారంభం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్తగా మంచినీళ్ల వ్యాపారంలోకి అడుగు పెట్టబోతోంది. కొత్తగా వాటర్ బాటిల్ ను బహిరంగ మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకుని రానుంది. ఈ వాటర్ బాటిల్ పేరు జివా (Ziva). స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అనేది దీని ట్యాగ్ లైన్. సోమవారం నుంచి ఈ వాటర్ బాటిల్ విక్రయాలను ప్రారంభించనుంది టీఎస్ఆర్టీసీ.

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్.. ఈ వాటర్ బాటిల్ విక్రయాలను ప్రారంభించనున్నారు. ఈ వాటర్ బాటిల్.. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లల్లో అందుబాటులోకి తీసుకుని రానుంది. బహిరంగ మార్కెట్ లోనూ ఈ మంచినీళ్ల బాటిళ్లను విక్రయానికి ఉంచనుంది ఆర్టీసీ.

TSRTC to enter in water business with to launch Ziva water bottle on January 9

మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రవాణా, రోడ్డు-భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్.. ఈ వాటర్ బాటిల్ విక్రయాలను ప్రారంభించనున్నారు. ఈ వాటర్ బాటిల్ ను సొంత బ్రాండ్ తో ఉత్పత్తి చేయనుంది టీఎస్ఆర్టీసీ.

ప్రయాణికుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఈ వాటర్ బాటిల్స్ విక్రయాలను చేపట్టినట్లు వీసీ సజ్జనార్ తెలిపారు. మంచినీరు పేరుతో కల్తీ బ్రాండ్లు అనేకం బహిరంగ మార్కెట్‌లోకి పంపిణీ అవుతున్నాయని, వాటికి స్వస్తి చెప్పబోతోన్నామని అన్నారు. జివా పేరుతో స్వచ్ఛమైన మంచినీటిని ప్రయాణికులకు అందించనున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో జివా వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు.

జివా అంటే తేజస్సు, కాంతి- దీనికి తగ్గట్టుగానే మంచినీటిని సరఫరా చేస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. ఆకర్షణీయంగా వాటర్‌ బాటిల్‌ ను డిజైన్‌ చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బాటిల్స్ కు భిన్నంగా డైమండ్‌ కట్స్‌ తో వీటిని డిజైన్ చేసినట్లు వివరించారాయన.

English summary
TSRTC to enter in water business with to launch Ziva water bottle on January 9. The water bottle is available in all retail outlets in TSRTC busstands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X