హిమాయత్ నగర్ లోని టీటీడీ కళ్యాణమండపం సీజ్ ... ఎందుకో తెలుసా
హిమాయత్ నగర్ లోని టీటీడీ కళ్యాణ మండపాన్ని తిరుమల విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు . లీజు గడువు ముగిసినా డబ్బు చెల్లించకుండా కళ్యాణ మండపాన్ని వినియోగించటమే కాకుండా వివాహాది శుభవేడుకలకు అద్దెకివ్వకుండా, వాణిజ్య కార్యకలాపాలకు మాత్రమే వాడుతున్నారన్న కారణంతో హైదరాబాద్, హిమాయత్ నగర్ లోని టీటీడీ కళ్యాణ మండపాన్ని సీజ్ చేసినట్టు తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్వహిస్తుండటంతోనే తిరుమల విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు.
ప్రైవేటు వ్యాపారాలకు కళ్యాణమండపాన్ని అద్దెకివ్వడం నిబంధనలకు విరుద్ధం . అలా నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వాణిజ్య కార్యాకలాపాలకు ఇస్తున్నారు. లీజుదారుడు చెల్లించాల్సిన బకాయి కోటి రూపాయలు దాటి పోయిందని వెల్లడించిన అధికారులు, గత సంవత్సరం అక్టోబర్ తోనే లీజు గడువు ముగిసిందని తెలిపారు.కాగా, ప్రస్తుతం ఈ కళ్యాణమండపం ఎస్ వైష్ణవి అనే మహిళ పేరుతో కొనసాగుతోంది.

అప్పట్లో లైసెన్స్ దారు కోర్టుకు వెళ్లి ఎక్స్ టెన్షన్ కోరుతూ స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అధికారులు తెలిపారు. పెళ్లిళ్లకు మండపాన్ని ఇవ్వకుండా కేవలం ఎగ్జిబిషన్లు తదితరాలకు మాత్రమే ఇస్తున్న విమర్శలు వెల్లువెత్తడంతో విజిలెన్స్ అధికారులు దాడులు చేసి, మండపాన్ని సీజ్ చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications