tweet viral:దోచుకుంటున్నారని ట్వీట్.. దొంగలు + కేసీఆర్, మోడీ.. వైరల్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యాయి. ప్రధాని మోడీ వచ్చారు. అయితే టీఆర్ఎస్- బీజేపీ మధ్య ప్లెక్సీల గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ప్లెక్సీ హల్ చల్ చేస్తోంది. అందులో కొందరు దొంగలు ఉన్నారు. దానిని ఒకరు షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ప్రధాని మోడీని విమర్శిస్తూ ఉండటంతో.. మంత్రి కేటీఆర్ షేర్ చేశారు.

ఏముందంటే...
ప్లెక్సీలో దొంగల ముఠా ఉంది. అందులో మిస్టర్ నరేంద్ర మోడీ మేము బ్యాంకులనే దొచుకుంటాం అని రాసి ఉంది. కానీ మీరు మాత్రం యావత్ దేశాన్ని దోచుకుంటారు అని రాసి ఉంది. దీనిని ఒకరు షేర్ చేయగా వైరల్ అవుతుంది. ఇదే అదనుగా భావించిన టీఆర్ఎస్ నేతలు కూడా ఫార్వార్డ్ చేస్తున్నారు.

మరొ ట్వీట్
మరో ట్వీట్ కూడా వైరల్ అయ్యింది. అందులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫోటోలు ఉన్నాయి. మేం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే దోచుకుంటున్నామని రాసి ఉంది. మోడీ మాత్రం దేశం మొత్తాన్ని దోస్తున్నారని ఉంది. ఈ ట్వీట్ కూడా తెగ వైరల్ అవుతుంది. దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్..
పై రెండు ట్విట్లు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దొంగలు ఎవరూ... జాతిని దోస్తున్నది ఎవరూ అంటూ రాస్తున్నారు. వీటిపై అనుకూల, వ్యతిరేక ట్వీట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications