హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబేడ్కర్ విగ్రహం సీరియస్ స్పందించిన పోలీసులు, ఇద్దరు అరెస్ట్

|
Google Oneindia TeluguNews

బాబా సాహెబ్ అంబెద్కర్ విగ్రహం ధ్వంసం చిలికి,చిలికి గాలివానగా తయారవుతోంది. అంబేడ్కర్ విగ్రహం డంపింగ్ యార్డ్ కు తరలడంపై రాజకీయ ఒత్తిడిలకు తలోగ్గిన ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది ,దీంతో ఇందుకు కారణమైన ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల అరెస్ట్

ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల అరెస్ట్

పంజాగుట్టలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని భావించిన అంబెద్కర్ వాదులకు చేదుఅనుభవం ఎదురైన విషయం తెలిసిందే . పంజాగుట్టా చౌరస్తాలో విగ్రహం పెట్టుకుండా అడ్డుకున్న పోలీసులు అనుహ్యంగా ఆ విగ్రహాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడీయానికి తరలించారు.అయితే ఇక్కడవరకు బాగానే ఉన్నా , ఆ విగ్రహం హఠాత్తుగా చెత్త డంప్ యార్డులో ప్రత్యక్షమైంది. అంబేద్కర్ జయంతి రోజున ఇంత పెద్ద అవమానం జరగడంతో అంబేద్కర్ వాదులు ఆందోళనకు దిగారు. ఈనేపథ్యంలోనే నగరంలో పులువురు నాయకులు ధర్నాలు ఆందోళనలు కొనసాగించడంతో పాటు ప్రతిపక్షపార్టీలను నుండి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈనేపథ్యంలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దీనిపై స్పందించారు. దీనికి సంబంధించి వెంటనే బాద్యులను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులను అరెస్ట్ చేశారు.

ఇంతకి విగ్రహం ఎలా ముక్కైలైంది.

ఇంతకి విగ్రహం ఎలా ముక్కైలైంది.

అయితే శుక్రవారం అర్థరాత్రి విగ్రహాన్ని కేవలం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించామని ,జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. దీంతో అక్కడినుండి డంప్ యార్డుకు ఎలా తరలించారో తెలియదని చేతులెత్తేశారు ,అయితే ఎవరి ఒత్తిడి, అధికారం లేకుండా విగ్రహం ఒక్క రాత్రిలోనే డంపింగ్ యార్డుకు ఎలా చేరిందో అర్థం కాని పిరిస్థితి , పై అధికారుల అదేశాలు లేకుండా క్రింది స్థాయి సిబ్బంది ఏకంగా డంపింగ్ లారీలో తరలించారో తెలియని పరిస్థితి నెలకోంది . దీంతో జీహెచ్‌ఎంసీ అధికారుల పాత్రం ఉందని పలువురు దళితనాయకులు పోలీసులకు పిర్యాధు చేశారు. ఈనేపథ్యంలోనే ఇందుకు కారణమైన ఇద్దరు జీహెచ్ఎంసీ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు విచారణ సైతం కొనసాగుతుందని చెప్పారు.

ప్రతి పక్షాలకు ఆయుధంగా అంబేడ్కర్ విగ్రహం

ప్రతి పక్షాలకు ఆయుధంగా అంబేడ్కర్ విగ్రహం

అయితే అంబేడ్కర్ జయంతి సంధర్బంలోనే విగ్రహ ధ్వంసం జరగడంపై ప్రతిపక్ష పార్టీలతో పాటు ,అంబేడ్కర్ వాదులు సీరియస్ తీసుకున్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అంత్యంత ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేస్తామన్న హమీ తుంగలో తోక్కడం తోపాటు ,ఇలాంటీ దారుణాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రతిపక్షపార్టీలు ఆయుధంగా మార్చుకున్నాయి.దీంతో ఆందోళన కొనసాగించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు.

English summary
two ghmc employees were arreted who involve in the dr.BR Ambedker statue destroyed in hyderabad ,and further investigation is going on,police said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X