Hyderabad: హైదరాబాదీలకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న రెండు ఫ్లైఓవర్..!
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎట్టకేలకు ఎట్టకేలకు 1.5 కిలోమీటర్ల పొడవైన అంబర్పేట్ ఫ్లైఓవర్ సిటీ వాసులకు అందుబాటులోకి రానుంది. ఫ్లైఓవర్‌ను త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఫ్లై ఓవర్ కు సంబంధించి చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయి. వాటిని పూర్తి ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు. నాలుగు లేన్ల ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నారు. వరంగల్ హైవే నుంచి నగరంలోకి వచ్చే ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది.
ఫ్లైఓవర్ కోసం రూ.450 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఫ్లై ఓవర్ గోల్నాక దగ్గర ప్రారంభమై MCH క్వార్టర్స్ సమీపంలోని పూర్ణోదయ కాలనీలో ముగుస్తుంది.హైదరాబాద్ అంబర్పేట్ ఫ్లైఓవర్ 2018లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కానీ 2021లో పనులు ప్రారంభమయ్యాయి. 2023లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ గుత్తేదారులు నిర్లక్ష్యం వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. లేకుంటే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించడంతో పనులు త్వరగా ముగిశాయి.

అంబర్ పేట ఫ్లై ఓవర్ తో పాటు ఆరామ్‌ఘర్ నుంచి జూ పార్క్ ఫ్లైఓవర్ ను త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి అయింది. మొదటగా డిసెంబర్ 3న దీన్ని ప్రారంభించాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. త్వరలోనే దీన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ పొడువు 4.04 కిలోమీటర్లుగా ఉంది. పీవీఆర్ ఎక్స్ ప్రెస్ వే తర్వాత హైదరాబాద్‌లో రెండవ పొడవైన ఫ్లైఓవర్‌గా నిలిచింది.
ఆరు-లేన్లుగా దీన్ని నిర్మించారు. ఇది ఆరామ్‌ఘర్‌ను నెహ్రూ జూలాజికల్ పార్క్‌తో కలుపుతుంది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తగ్గనుంది.ఆరామ్‌ఘర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఆరామ్‌ఘర్, శాస్త్రిపురం, కాలాపత్తర్, దారుల్ ఉలూమ్, శివరాంపల్లి, హసన్‌నగర్ వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతోన్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications