బతికున్న పసిబిడ్డను పాతిపెట్టేందుకు యత్నించిన జంట... !
Recommended Video
సమాజంలో పిల్లలకు అనేక మంది భాదపడుతుంటే, మరికొంత మంది మాత్రం పుట్టిన పిల్లలను నిర్ధాక్షిణ్యంగా వదులుకుంటున్నారు. ఆర్ధిక స్థోమత , సమాజం పరిమాణాలు ,పరువు సమస్యలతో ఎంతో మంది చిన్నారులు లోకం చూసిన మరుక్షణమే కొంతమంది వ్యక్తుల కర్కశత్వానికి బలవుతున్నారు. అయితే పిల్లలను బలవంతంగా తీసుకువస్తున్నారా లేక తల్లితండ్రులే ఇలాంటీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారా అనేది అర్థం కాకుండా తయారైంది. మొత్తం మహనగరంలో మానవత్వం మరిచే సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే హైదరాబాద్ జూబ్లీబస్ స్టాండ్ అవరణంలో మరో దారుణం వెలుగు చూసింది.
బస్‌స్టేషన్ సమీపంలోని ఓ పసిబిడ్డను పూడ్చేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నం చేశారు. అయితే అనుమానస్థితిలో పసిబిడ్డను పాతిపెడుట్టెందుకు గోయ్యి తవ్వుతున్న విషయాన్ని అక్కడే ఉన్న ఓ ఆటోడ్రైవర్ పసిగట్టాడు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న పోలీసు కానిస్టేబుల్‌కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బిడ్డను పాతిపెడుతున్న స్థలానికి చేరుకుని ఇద్దరిని విచారించారు. బిడ్డను ఎందుకు పాతిపెడుతున్నారని ప్రశ్నించారు.

దీంతో వారు కరీంనగర్‌కు ప్రాంతానికి చెందినవారమని పాతిపెడుతున్న పసిపాప తమ మనుమరాలని తెలిపారు. ఓ ఆపరేషన్ విఫలం కావడంతో బిడ్డ చనిపోయిందని , చనిపోయిన బిడ్డను బస్సుల్లో ప్రయాణించేందుకు ఒప్పుకోరు కాబట్టి ఇక్కడే పాతిపెడుతున్నట్టు తెలిపారు. అయితే కానిస్టేబుల్ మాట్లాడుతున్న సమయంలో గుడ్డలో ఉన్న పసిబిడ్డ కదులుతుండడాన్ని గమనించారు. దీంతో వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక బతికున్నబిడ్డను చికిత్స కోసం గాంధీ అసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications