‘మరే ఆడపిల్లకూ ఇలాంటి పరిస్థితి రాకూడదు’: 10 రోజుల్లో పెళ్లి, ఇద్దరు యువతుల ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతుల ఆత్మహత్యతో స్థానికంగా విషాదం నెలకొంది.

ఎవరూ లేని సమయంలో..

ఎవరూ లేని సమయంలో..

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ రాఘవేంద్రకాలనీకి చెందిన ఇద్దరు యువతులు మమత(20), గౌతమి(21) మంచి స్నేహితులు. పక్క పక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు. అయితే, శుక్రవారం మమత ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సోదరుడు వచ్చేసరికి విగతజీవులుగా..

సోదరుడు వచ్చేసరికి విగతజీవులుగా..

మమత తల్లిదండ్రులు ఓ శుభకార్యం నిమిత్తం మహబూబ్‌నగర్‌కు వెళ్లగా.. సోదరుడు స్కూల్‌కు వెళ్లాడు. శుక్రవారం సాయంత్రం ఆమె సోదరుడు ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి.. ఇద్దరూ ఇంటి పైకప్పు రాడ్‌కు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. దీంతో అతడు భయాందోళనకు గురై ఇరుగుపొరుగును పిలిచాడు.

కుటుంబానికి భారం కూడదని..

కుటుంబానికి భారం కూడదని..


స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబసభ్యులకు తాము భారంగా మారడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాశారు.

10రోజుల్లో పెళ్లి.. మరే ఆడపిల్లకూ ఇలాంటి పరిస్థితి రావొద్దు..

10రోజుల్లో పెళ్లి.. మరే ఆడపిల్లకూ ఇలాంటి పరిస్థితి రావొద్దు..

కాగా, కట్నకానుకలు భారీగా ఇవ్వాల్సి వస్తుందనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. మరే ఆడపిల్లకు ఇలాంటి పరిస్థితి రాకూడదని సూసైడ్ నోట్లో రాశారు. మృతుల్లో ఓ యువతికి పది రోజుల్లో వివాహం జరగాల్సి ఉన్నట్లు తెలిసింది. ఈ లోపే ఈ దారుణ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డిగ్రీ చదువుకున్న యువతులు ఇలా అర్ధాంతరంగా జీవితాలను ముగించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+