తెలంగాణ హైకోర్టు సీజేగా ఉజ్జల్ భుయాన్, గెజిట్ విడుదల
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియామకం అయ్యారు. గత నెల మే నెలలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి గెజిట్ విడుదల చేసింది. హైకోర్టు సీజేగా నియామకమైన ఉజ్జల్ భుయాన్ ప్రస్తుతం తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో పనిచేస్తున్నారు.
ఉజ్జల్ భుయాన్ 1964 ఆగస్ట్ 2న గౌహతిలో జన్మించారు. డాన్‌బాస్కో పాఠశాలలో ఎడ్యుకేషన్ కొనసాగింది. స్థానిక ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ఆయన గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2010లో గౌహతి హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా చేరారు. 2011లో అసోం అదనపు ఏజీగా, అదే సంవత్సరం అక్టోబర్‌లో గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియామకం అయ్యారు.

2019లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. సుప్రింకోర్టు కొలీజియం సిఫారసు మేరకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టు సీజేగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా కొనసాగుతున్న సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications