హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

viral news:నరసింహ.. గ్రేట్ యార్, మిర్చి బండి పెట్టి, ఆదర్శం..

|
Google Oneindia TeluguNews

పోరాడి సాధించుకున్న తెలంగాణలో నియామకాల అంశం ఇంపార్టెంట్. నీళ్లు, నిధులు కూడా ట్యాగ్ లైన్.. కానీ స్వ రాష్ట్రం వచ్చి ఏడేళ్లు అవుతోంది. అయినా కీలక అంశాలపైనే స్పష్టత రాలేదు. కొలువుల కోసం యువత ప్రశ్నించి.. ప్రశ్నించి గొంతు మూగబోయింది. అడిగి అడిగి వేశారి పోయారు. కొందరు పని చేసుకుంటున్నారు. మరికొందరు జీవితం చాలనుకొని చాలిస్తున్నారు. అలా కొందరు అర్ధాంతరంగా లైఫ్ ఎండ్ చేస్తున్నారు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. అయితే ఓ నిరుద్యోగి మాత్రం అలా చేయలేదు. గ్రేట్ అనిపించేలా చేశారు. అదేంటి చుద్దాం పదండి.

ఇంటికో ఉద్యోగం..

ఇంటికో ఉద్యోగం..

ఏ ప్రభుత్వం అయినా సరే.. అందరికీ కొలువు ఇవ్వడం ఈజీ కాదు. కానీ కేసీఆర్ మాత్రం ఇంటికో ఉద్యోగం అని కామెంట్ చేశారు. దానిని అందరూ అడుగుతున్నారు. నరసింహ మాత్రం అలా చేయలేదు. ఏం చక్కా మిర్చి బండి పెట్టుకున్నారు. దానికి తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి అని పేరు పెట్టారు. తాను ఎందుకు అలా పెట్టానో వివరించారు. దీనిని కొందరు పోస్ట్ చేశారు. దీంతో వైరల్ అయ్యింది. నరసింహ గురించి ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్నారు. తనకు జాబ్ రాలేదని.. అయితే చూస్తూ ఊరుకోలేదని చెప్పారు. అందుకోసమే మిర్చి బండి ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇదీ మిగతావారికి ఆదర్శంగా నిలవనుంది. ఊరికే ఆత్మహత్య చేసుకోకుండా సొంతంగా తమ కాళ్లపై నిలబడే ఛాన్స్ ఉంటుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురుచూసే పరిస్థితి ఉండదు.

మిర్చి బండీ

మిర్చి బండి అని ప్లెక్సీ పెద్దగా పెట్టాడు నరసింహ. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు బండి ఉంటుందని.. సెల్ప్ ఎంప్లాయిడ్ అని రాసుకున్నాడు. వెజ్ మాత్రమే చేస్తానని.. నాన్ వెజ్ చేయనని చెప్పాడు. మిర్చి, పునుగులు, వడ వేడి వేడిగా వేస్తానని వివరించాడు. అందుకోసం వాడిన నూనె మళ్లీ వాడనని ప్లెక్సీలో రాసుకున్నాడు. వినియోగదారుల ఆరోగ్యం దృష్ట్యా సన్ ప్లవర్ ఆయిల్ వాడతానని చెప్పాడు. ఫామాయిల్ వాడనని.. కస్టమర్స్ హెల్త్ ఇంపార్టెంట్ అని తేల్చిచెప్పాడు. అన్నీ ఫంక్షన్లకు ఆర్డర్స్ కూడా తీసుకుంటానని తెలిపాడు. కస్టమర్స్/ ఫంక్షన్లకు సంబంధించి క్యాష్‌తోపాటు డిజిటల్ చెల్లింపులు కూడా తీసుకుంటానని వివరించాడు.

బూస్ట్ ఇచ్చే అంశమే

బూస్ట్ ఇచ్చే అంశమే

నరసింహ మాత్రం మంచి విషయాన్ని సమాజానికి తెలియజేశాడు. తనకు కొలువు రాలేదని.. అందుకోసం ఊరికే ఉండకుండా ఉపాధి కోసం మిర్చి బండి పెట్టానని తెలిపాడు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇదీ బూస్ట్ ఇచ్చే విషయం కానుంది. అందరూ నరసింహను గుర్తుచేసుకునే ఛాన్స్ ఉంది. పలువురు నెటిజన్లు కూడా పోస్టులు పెడుతున్నారు. శభాష్ నరసింహ అంటూ ప్రశంసిస్తున్నారు. స్వయం ఉపాధి చూసుకుంటూ.. మంచి పేరు తెచ్చుకుంటున్నారని కొనియాడుతున్నారు. నిజానికి నరసింహ చేసింది మంచి పనే.. కొందరు క్షణికావేశంలో నిర్ణయం తీసుకునేవారు ఆలోచించాలని పలువురు కోరుతున్నారు. అలా చేస్తే ఏ సమస్య ఉండదని.. అర్హులకు జాబ్స్.. మిగతావారు స్వయంగా ఉపాధి చూసుకునే వీలు కలుగుతుంది.

జాబ్స్ ఏవీ..?

జాబ్స్ ఏవీ..?

ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిందే ఉద్యోగాల కోసం.. కానీ ఏడేళ్లలో జాబ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేవు. ప్రభుత్వం చెబుతున్న సంఖ్య మాత్రం లేదని నిరుద్యోగులు అంటున్నారు. ఇప్పటికీ చాలా మంది జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. నోటిఫికేషన్ పేరు చెప్పి కాలం వెళ్లదీశారని.. కొన్నింటినీ కోర్టు కేసులతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రతీ అంశాన్ని కమిషన్ వేగంగా స్పందించి.. నిర్ణయం తీసుకుంటే సమస్య వచ్చి ఉండేది. సర్కార్, కమిషన్ కలిసి భర్తీ చేసిన కొలువులు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. అందుకే నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున అబ్జెక్షన్స్ వచ్చాయనేది కఠోర సత్యం.

2018 ఎన్నికల సమయంలో..

2018 ఎన్నికల సమయంలో..

2018 ఎన్నికల సమయంలో లక్షా 12 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పాలకులు చెప్పారు. 2018 నాటికి లక్షా 9 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వాటిలో 87,346 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాగా, ఆ నాలుగేళ్లలో 32,681 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఆ తరువాత ఇప్పుడు లక్షా 32 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. లక్షా 32 వేలు... ఆ లక్షా 12 వేలతో కలిపా కాదా? అన్నది ప్రశ్న. ముందుగా ఈ లక్షా 32 వేల ఉద్యోగాల్లో ఏమున్నాయో చూద్దాం. 2021 మార్చి వరకూ 1,32,899 ఉద్యోగాలు ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

ఇదీ లెక్క

ఇదీ లెక్క

30,594 ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చారు. ఇక 31, 972 పోలీసు శాఖ ఉద్యోగాలు. పంచాయితీ కార్యదర్శులు 9,355, రెసిడెన్షియల్ స్కూల్స్ 3,623, ఆర్టీసీ 4,768, సింగరేణి 12,500, కరెంటు తయారీ, పంపిణీ సంస్థలు 6,648 పోస్టులు వీటిలో ఉన్నాయి. అలాగే విద్యుత్ శాఖలో పర్మినెంటు చేసిన 22,637 ఉద్యోగాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి కాక పలు చిన్న సంస్థలు, కోపరేటివ్ బ్యాంకులు, జలమండలి వంటివి ఆ జాబితాలో ఉన్నాయి. మరో 6,258 ఉద్యోగాలు ఆ ప్రక్రియ చివర్లో ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తే ఈ లక్షా 32 వేల ఉద్యోగాలూ, అప్పట్లో కేటీఆర్ ప్రకటించిన లక్షా 12 ఉద్యోగాల కలిపే అవ్వాలి. తాజాగా మరో 50 వేల ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. వివిధ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఆ ప్రకటన చేశారు. అయితే అవి ఏఏ శాఖల కింద అనేది మాత్రం స్పష్టత రావడం లేదు.

English summary
unemployed narasimha establish mirchi bandi. photo viral in social media. netizens praise narasimha for his own talent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X