హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వావ్.. సూపర్ గురూ: పోలీస్ కొలువు కోసం ప్లాట్‌పామ్ వద్ద ప్రిపేర్, పోస్ట్

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ కొలువు అంటే క్రేజీ మాములుగా ఉండదు.. ఇక ఖాకీ చొక్కా అయితే ఆ థ్రిలే వేరు.. ఎప్పుడూ జనంలో ఉండొచ్చు.. లా అండ్ ఆర్డర్ అని అంతా అనుకుంటున్నారు. పోలీసు కొలువులకు కూడా నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. దీంతో అంతా ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఒకతను మాత్రం.. కొలువు కొట్టాలనే కసితో చదువుతున్నాడు. అతని ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదీ తెగ ట్రోల్ అవుతుంది.

రిటన్ టెస్ట్

రిటన్ టెస్ట్


పోలీసు కొలువు అంటే రాత ప‌రీక్షతోపాటు దేహ దారుఢ్య ప‌రీక్షలో కూడా అభ్య‌ర్థులు ఉత్తీర్ణులు కావాల్సిందే. అందులో ఉత్తీర్ణ‌త సాధిస్తేనే రాత ప‌రీక్ష‌కు అర్హ‌త ల‌భిస్తుంది. ఫిజికల్ ఎగ్జామ్ ముగియ‌గా... కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీలో రాత ప‌రీక్ష‌కు రంగం సిద్ధ‌మైంది. ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్న అభ్య‌ర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అవును రేయి, పగలు అనే తేడా లేకుండా చదువుతున్నారు.

రైల్వే ప్లాట్‌ఫామ్‌పై

రైల్వే ప్లాట్‌ఫామ్‌పై


పుస్త‌కాల‌ను ముందేసుకుని రైల్వే ఫ్లాట్‌ఫామ్ మెట్ల‌పై ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్న ఓ అభ్య‌ర్థి ఫొటోను సీనియ‌ర్ ఐపీఎస్ అధికారిణి స్వాతి ల‌క్రా సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేశారు. ప‌ట్టుద‌ల ఉంటే ఫ‌లితం ద‌క్కుతుందని అన్నారు. నిరుద్యోగార్థుల్లో ఉత్సాహాం నింపారు. మరికొందరు కసిగా చదివేందుకు అవకాశం కల్పించారు. ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఆదర్శనీయం

ఆదర్శనీయం


అతను చూపిన తెగువ అందరికీ ఆదర్శనీయం.. ఇదే విషయాన్ని స్వాతి లక్రా చెప్పారు. వేలాది మందికి చేరాలని ట్వీట్ చేశారు. దానికి చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అతను తప్పకుండా కొలువు కొడతాడని కామెంట్ చేస్తున్నారు. అతనిలో ఉన్న కసే.. విజయం దిశగా అడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత పట్టుదల ఉన్న వ్యక్తి డిపార్ట్ మెంట్‌కు అవసరం అని అభిప్రాయపడ్డారు. అతనికి ఉన్న పట్టుదల.. మరికొందరికి ఇన్సిరేషన్‌గా మారుతుందని చెప్పారు.

English summary
Ips officer swati lakra praises candidate who prepares for police constable examinations at railway station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X