హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బైంసా ఘర్షణలపై కేంద్రమంత్రి అమిత్ షా ఆరా: డీజీపీకి కిషన్ రెడ్డి ఫోన్, కేటీఆర్ స్పందన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోంశాఖ అమిత్ షా ఆరా తీశారు. హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అమిత్ షాకు మంత్రి వివరించారు.

బైంసా అల్లర్లపై కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్

బైంసా ఘర్షణలపై అమిత్ షా తనకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలసుకున్నారని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఘర్షణలపై డీజీపీతో రెండుసార్లు మాట్లాడినట్లు తెలిపారు. మరోవైపు బైంసా అల్లర్ల ఘటనలో బాధితులకు న్యాయం జరగాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీలకు విజ్ఞప్తి చేశారు. చట్టవ్యతిరేక చర్యలను ప్రభుత్వం సహించదని అన్నారు.

ఆదివారం రాత్రి బైంసాలో ఘర్షణలు

ఆదివారం రాత్రి బైంసాలో ఘర్షణలు

కాగా, ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో బైంసాలోని జుల్ఫేకార్‌గల్లీ, కుబీరు రహదారి, గణేష్‌నగర్, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఎస్సై, కానిస్టేబుల్ తోపాటు మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. గాయపడినవారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. దాడుల్లో తీవ్రంగా గాయపడినవారిని నిజాబాద్, హైదరాబాద్‌కు తరలించారు. దాడుల్లో పలు వాహనాలు, బస్టాండు ఎదుట దుకాణాలు దహనమయ్యాయి. డీఎస్పీ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. జిల్లా ఇంఛార్జీ ఎస్పీ విశ్వ వారియర్ బైంసా చేరుకుని సమీక్షించారు. ఇప్పటికే పలు ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఘర్షణలకు కారణమైన 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బైంసాలో రెండోసారి తీవ్ర ఘర్షణలు

బైంసాలో రెండోసారి తీవ్ర ఘర్షణలు


గత సంవత్సరం కూడా బైంసాలో భారీ ఎత్తున ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఓ వర్గానికి చెందని ఇళ్లను మరో వర్గానికి చెందినవారు తగలబెట్టారు. బైంసాలో అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బండి సంజయ్ అన్నారు. మనం భారతదేశంలో ఉన్నమా? పాకిస్థాన్‌లో ఉన్నామా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలకు భయపడి పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాయొద్దని అన్నారు. ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాయడం వల్లే బైంసాలో తరచూ అల్లర్లు జరుగుతున్నాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బైంసాలో ఒక వర్గానికి ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు అండగా ఉంటున్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

English summary
union home minister amit shah inquired about bhainsa clashes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X