Prabhas: కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న అమిత్ షా.. ప్రభాస్‌తో ప్రత్యేక భేటీ..
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రముఖ టాలీవుడ్ హీరో ప్రభాస్‌తో భేటీ కానున్నారు. ఈ నెల 16న హైదరాబాదద్ రానున్న అమిత్ షా అదే రోజు కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారు. అదే రోజు సాయంత్రం హీరో ప్రభాస్‌తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
ఎన్టీఆర్ తో
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. ఇటీవలే మునుగోడు పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్ తో సమావేశం అయ్యారు.

ప్రత్యేక భేటీ ఎందుకు
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోహైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం గవర్నర్ తమిళి సై పరేడ్ గ్రౌండ్ లో ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అయితే అమిత్ షా ప్రభాస్‌తో ప్రత్యేకంగా భేటీ అవ్వడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications