హైదరాబాద్‌లో కరోనా కల్లోలం: హెచ్‌సీయూలో ఇకపై ఆ టెస్టులు కూడా: కేంద్రం అనుమతి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ అనూహ్యంగా విస్తరిస్తోంది. గంటగంటకూ కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి కేసీఆర్ సర్కార్ ఎన్ని ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నప్పటికీ.. దీని వేగానికి అడ్డుకట్ట పడట్లేదు. పరిస్థితి రోజురోజుకూ అదుపు తప్పినట్టు కనిపిస్తోంది. తెలంగాణలో 700ల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోనే 230కి పైగా కేసులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
కరోనా వైరస్ పాజిటివ్ టెస్టులను మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ)ను కరోనా వైరస్ పరీక్షల కేంద్రంగా మార్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే డిపార్ట్‌మెంట్ ఆప్ బయో టెక్నాలజీ అనుమతులను మంజూరు చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ క్యాంపస్‌లోని భవనాల్లో దీన్ని నెలకొల్పబోతున్నారు.

ప్రస్తుతం అక్కడ అందుబాటులో ఉన్న వనరులను కూడా కరోనా వైరస్ పరీక్షల కోసం వినియోగించుకోవడానికి కేంద్రం వీలు కల్పించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలుచోట్ల కరోనా వైరస్ టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయి. సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగ్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ), సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీల్లో ప్రస్తుతం కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. దీనికి అదనంగా హెచ్‌సీయూను కూడా చేర్చింది కేంద్ర ప్రభుత్వం.












Click it and Unblock the Notifications