హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కార్యాలయం తరలింపు: 20 నుంచి సేవలు
యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం హైదరాబాద్ నగర పరిధిలోనే మరో చోటికి తరలిపోతోంది.
హైదరాబాద్: నగరంలో ఏర్పాటైన యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం హైదరాబాద్ నగర పరిధిలోనే మరో చోటికి తరలిపోతోంది. దక్షిణాసియాలో అతిపెద్దదిగా మారనున్న నానక్రామ్‌గూడలోని కొత్త యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ మార్చి 20 నుంచి కాన్సులర్ సేవలను ప్రారంభించనుంది.
యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గోల్డ్-ట్యాగ్ చేసిన నిర్మాణం కోసం యూఎస్ 297 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది.

ప్రస్తుతం బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్‌లో ఉన్న కాన్సులేట్ జనరల్ మార్చి 20వ తేదీకి కొత్త కార్యాలయానికి మారుతుంది. పైగా ప్యాలెస్‌లోని యూఎస్ కాన్సులేట్ కార్యకలాపాలు మార్చి 15 మధ్యాహ్నం నుంచి నిలిపివేయనున్నారు.
కొత్త కాన్సులేట్‌లో, సేవలు మార్చి 20 ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతాయి. కాన్సులేట్ మార్చి 15 మధ్యాహ్నం నుంచి మార్చి 20న కొత్త భవనం ప్రారంభించే వరకు ప్రజలకు అందుబాటులో ఉండదు.
మార్చి 8, 15 మధ్య షెడ్యూల్ చేయబడిన వీసా ఇంటర్వ్యూలు పైగా ప్యాలెస్‌లో నిర్వహించబడతాయి. మార్చి 23 లేదా తర్వాత షెడ్యూల్ చేయబడిన ఇంటర్వ్యూలు నానక్రామ్‌గూడలోని కొత్త యూఎస్ కాన్సులేట్ భవనంలో నిర్వహించనున్నారు.
బయోమెట్రిక్స్ అపాయింట్‌మెంట్‌లు, 'డ్రాప్‌బాక్స్' అపాయింట్‌మెంట్‌లు (ఇంటర్వ్యూ మినహాయింపు), పాస్‌పోర్ట్ పికప్, అన్ని ఇతర సేవలు వీసా అప్లికేషన్ సెంటర్ (వీఏసీ), దిగువ కాంకోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, మాదాపూర్‌లో కొనసాగుతాయి.
అత్యవసర కాన్సులర్ సేవల కోసం, యూఎస్ పౌరులు మార్చి 20 వరకు 91 040 4033 8300ని సంప్రదించవచ్చు. మార్చి 20 నుంచి అత్యవసర కాన్సులర్ సేవలు అవసరమయ్యే యూఎస్ పౌరులు 91 040 6932 8000కి కాల్ చేయవచ్చు. నాన్-ఎమర్జెన్సీ కాన్సులర్ ప్రశ్నలు ఉన్నవారు ఇమెయిల్ [email protected]కు చేయవచ్చని తెలిపింది.












Click it and Unblock the Notifications