రేవంత్‌ది శునకానందమే: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రులు ఫైరయ్యారు. నిన్న ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దానికి మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి నోటి దూల తీర్చుకున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను తిట్టడం ద్వారా శునకానందం పొంది సభను ముగించారని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఆయనను చూస్తుంటే తమకు జాలి కలుగుతోందని అన్నారు.
చంద్రబాబు భిక్షతోనే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని ఆరోపించారు. ఇప్పటికీ చంద్రబాబు కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. శవాలపై పేలాలు ఏరుకునే రేవంత్ రెడ్డి, రోజుకో మాట, పూటకో పార్టీ మార్చుతుంటాడని ఫైరయ్యారు. ప్రజలు ఆయనను ఏవిధంగా నమ్మాలని ప్రశ్నించారు.

1981లో ఇంద్రవెల్లిలో ఆదివాసీ బిడ్డలను వందల మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు. ఆ నాడు ఇందిరాగాంధీ హయాంలో ఈ ఘాతుకం జరిగిందని తెలిపారు. అలాంటిది నిన్న అదే ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేయడం చూస్తుంటే గుండెలు మండాయని అన్నారు. ఆనాడు గిరిజనులను చంపి ఇవాళ స్మారకం కడతారా? అని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.
మరోవైపు హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు.
చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. బై పోల్ చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి.












Click it and Unblock the Notifications