హనుమంతన్న హల్‌చల్: ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసులకు, సీపీ ఆనంద్‌కు కంప్లైంట్..

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు.. శ్రేణులు అంతా వీహెచ్ అని పిలుచుకునే హనుమంతన్న.. ఈ మధ్య వార్తల్లోకి వస్తున్నారు. అంతకుముందు రోజు న్యూస్‌లో ఉండేవారు. ఈ సారి ఫిర్యాదులతో హల్‌చల్ చేస్తున్నారు. జగ్గారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. దానికి తగినట్టు జగ్గారెడ్డి కేసీఆర్‌ను కలిసినట్టు ఫోటోలు దర్శనం ఇచ్చాయి. కానీ పక్కన వీహెచ్ కూడా ఉన్నారు. దీంతో పెద్దాయన అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ సైబర్ క్రైమ్ తలుపు తట్టారు.

Recommended Video

    V Hanumantha Rao Excellent Speech On Sanjay Gandhi
    తప్పుడు ప్రచారం..

    తప్పుడు ప్రచారం..

    సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు వీహెచ్ ఫిర్యాదు చేశారు. తనని, జగ్గారెడ్డిని కేసీఆర్ పక్కన పెట్టి టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి మార్ఫింగ్ చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుచేశారు. సైబర్‌క్రైమ్ స్టేషన్‌లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తన మాటల చాతుర్యంతో ఆనంద్‌ను నవ్వించారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసెందుకు వచ్చానని చెప్పారు.డ్రగ్స్ నిరోధించే దిశగా తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. మాదక ద్రవ్యాల నివారణకు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ అమలు చేస్తున్న విధానాలను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారని అన్నారు.

    జూబ్లీహిల్స్ స్టేషన్‌లో హల్ చల్

    జూబ్లీహిల్స్ స్టేషన్‌లో హల్ చల్

    అంతకుముందు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వీహెచ్ హల్‌చల్ చేశారు. తాను టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నట్లు మార్ఫింగ్ ఫొటోలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ సీఐ చాంబర్‌లోకి నేరుగా వెళ్లిపోయారు. ఫిర్యాదు ఇచ్చే విషయంలో గొడవపడ్డారు. సీఐకి చేతులు చూపిస్తూ వీహెచ్ హడావిడి చేయడంతో తనను కమాండ్ చేయలేరంటూ సీఐ బదులిచ్చారు. సీఐ సమాధానంతో వీహెచ్ మరింత రెచ్చిపోయారు. ఏయ్.. నువ్వేంది ఎక్కువ మాట్లాడుతున్నవు. ఏం దాదాగిరీ చేస్తున్నవా అంటూ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావంటూ సీఐతో వాగ్వాదం జరిగింది. మళ్లీ చెబుతున్నా.. మీరు నన్ను కమాండ్ చేయలేరని సీఐ అనడంతో ఫిర్యాదు తీసుకుంటావా లేదా అని ప్రశ్నించారు. తానేమీ తీసుకోనని అనలేదన్న సీఐ వీహెచ్ ప్రవర్తనపై కాస్త అసహనం ప్రదర్శించారు.

    దుష్ప్రచారం..

    దుష్ప్రచారం..

    తమపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను టీఆర్ఎస్ కండువా కప్పుకున్నట్లు.. ఆ పక్కనే సీఎం కేసీఆర్, జగ్గా రెడ్డి ఉన్నట్లు మార్ఫింగ్ ఫొటోలతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. వాళ్లని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వారం రోజుల్లో చర్యలు తీసుకోకుంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తానని ఆయన హెచ్చరించారు. అలా నిన్న కంప్లైంట్ చేశారో లేదో.. ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసులను కలిశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+