హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీర్‌ను గద్దె దించడమే లక్ష్యం, ఉద్యోగాల ప్రకటనలు నీటమీద రాతలే: విజయశాంతి, నేతల విమర్శలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి మరోసారి ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ ప్రజల మేలు కోసం కాకుండా.. అధికార కాంక్ష కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. మేడ్చల్ జిల్లా బీజేపీ బీజేపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయశాంతి మాట్లాడారు.

కోకాపేట్, ఖానామెట్ భూమల వేలానికి హైకోర్టు ఓకే, కానీ.: విజయశాంతి స్పందనకోకాపేట్, ఖానామెట్ భూమల వేలానికి హైకోర్టు ఓకే, కానీ.: విజయశాంతి స్పందన

కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఉద్యమంలా..: విజయశాంతి

కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఉద్యమంలా..: విజయశాంతి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పుడు ఉద్యమించామని, ఇప్పుడు కేసీఆర్‌ను గద్దె దించేందుకు కార్యకర్తలు ఉద్యమంలా పనిచేయాలంటూ బీజేపీ కార్యకర్తలకు విజయశాంతి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి చరమగీతం పడాలంటే ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు.

తెలంగాణకే బీజేపీనే సంజీవని..

తెలంగాణకే బీజేపీనే సంజీవని..

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర సంపదను దోచుకుని రాష్ట్రాన్ని చిరిగిన విస్తారాకుల తయారు చేశాయని విజయశాంతి మండిపడ్డారు. గాడి తప్పిన తెలంగాణను గాడిలో పెట్టాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. కేసీఆర్ పాలనతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. బీజేపీ అధికారంలోకి సవ్తే సంజీవనిలా పనిచేస్తోందని విజయశాంతి వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓట్ల కోసం దళితులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు.

హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం 50వేల ఉద్యోగాలంటున్న కేసీఆర్

హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం 50వేల ఉద్యోగాలంటున్న కేసీఆర్

హుజూరాబాద్ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకునే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారని సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ సోయం బాపురావు ధ్వజమెత్తారు. ఇది ప్రజలను మోసం చేసే ప్రయత్నమేనని ఆరోపించారు. ప్రతి ఎన్నికల సమయంలో 50 వేల ఉద్యోగాలు ఇస్తామని సీఎం ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు ఎన్నికల సమయంలోనే ఉద్యోగాలు గుర్తుకు వస్తాయని బాపురావు మండిపడ్డారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక వస్తుందనే 50వేల ఉద్యోగాలంటున్నారని విమర్శించారు. కోనప్పకు ధైర్యం ఉంటే పోడుభూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడాలంటూ సవాల్ విసిరారు. పోడు భూముల విషయంలో ఆదివాసులకు అన్యాయం చేయొద్దన్నారు.

కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన నీటిమీద రాతలేనంటూ ఎన్వీఎస్ ప్రభాకర్

కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన నీటిమీద రాతలేనంటూ ఎన్వీఎస్ ప్రభాకర్


మరోవైపు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చెబుతున్న 50వేల ఉద్యోగాల నోటిఫికేషన్ నీటి మాద రాతలేనని ఎద్దేవా చేశారు. అందుకే నిరుద్యోగ యువత ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. సీఎం చెప్పినా అధికారులు ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవ్వకపోవడం.. కేసీఆర్ అసమర్థతేనని విమర్శించారు. ఇది నిరుద్యోగులను వంచించడమేనని అన్నారు. గో హత్యలు రాష్ట్రంలో యధేచ్చగా జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారని, గోవుల రవాణా చేస్తున్నవారిపై కేసులు పెడితే సహించమని హెచ్చరించారని అన్నారు. బక్రీద్‌కు ఆవులను వధిస్తే బీజేపీ కార్యకర్తలు ఊరుకోరని, ప్రభుత్వం స్పందించకుంటే తాము ప్రత్యక్ష చర్యలకు దిగుతామని హెచ్చరించారు.

English summary
Vijayashanti and soyam bapurao slams kcr for jobs statements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X