Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యాక్టివ్‌గా ఎందుకు లేననే అంశాన్ని బండి సంజయ్, లక్ష్మణ్‌ను అడగండి: రాములమ్మ సంచలనం

రాములమ్మ విజయశాంతి ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. తనకు ఏ పని అప్పగించడం లేదని మండిపడ్డారు. బండి సంజయ్, లక్ష్మణ్ లక్ష్యంగా విమర్శలు చేశారు. తన సేవలను జాతీయ నాయకత్వం తీసుకుంటుంది.. కానీ రాష్ట్ర నాయకత్వం అడగడం లేదని గుర్తుచేశారు. పార్టీలో తాను ఎందుకు యాక్టివ్‌గా లేనో అనే అంశంపై బండి సంజయ్‌నే అడగాలని సూచించారు.

తనకు ఏ బాధ్యత ఇచ్చారని పార్టీలో పనిచేయాలని రాములమ్మ ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వల్ల కొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉన్నానని వివరించారు. 24 ఏళ్ల నుంచి బీజేపీలో పనిచేస్తున్నాని తెలిపారు. ఏ బాధ్యత ఇచ్చారని పార్టీలో పనిచేయాలని అడిగారు. ఒకరిద్దరితో పార్టీలో పనులు జరగవని.. ప్రజా సమస్యలపై ఎవరికి అవగాహన ఉంటే వాళ్లను పార్టీలో ముందు వరుసలో ఉంచాలని కోరారు. బాధ్యత కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని.. అధిష్టానం దిశానిర్దేశం చేయాలని తెలిపారు.

vijayashanti made hot comments on bandi sanjay and laxman

పార్టీ తన సేవలను ఉపయోగించుకోవడం లేదని.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని తెలిపారు. పార్టీలో ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని.. పార్టీలో తనకు పాత్ర లేకుండా చేయాలని అనుకుంటున్నారని ఆరోపించారు. పని ఇవ్వకుండా చేయమంటే తనేం చేయాలని అడిగారు. జాతీయ నాయకత్వంతో ఇబ్బంది లేదని.. రాష్ట్ర నాయకత్వమే తన సేవలను వాడుకోవడం లేదన్నారు. టీమ్ వర్క్‌తో పనిచేస్తే బీజేపీ విజయం సాధిస్తోందని.. ఒకరిద్దరితో అధికారంలోకి రాలేమని తెలిపారు.

సీనియర్ నేతలను కలుపుకొని పోకుంటే పార్టీకే నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర పరిస్థితులపై జాతీయ నాయకత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ మేలు జరుగుతుందని విశ్వసిస్తున్నానని తెలిపారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని విజయశాంతి కామెంట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+