హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేడు సభలో సీఎం కేసీఆర్ దొరగారిని ఒకసారి చూసుకోండన్న విజయశాంతి.. ఎందుకో తెలుసా !!

|
Google Oneindia TeluguNews

జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ బహిరంగ సభ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో నేడు సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఏ విషయాలు ప్రస్తావిస్తారు అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గ్రేటర్ ఓటర్లను తనవైపుకు తిప్పుకోవడం కోసం సీఎం కేసీఆర్ ఏం వరాలు ప్రకటిస్తారో అన్న ఆసక్తి గ్రేటర్ హైదరాబాద్ వాసుల్లోనూ వ్యక్తమవుతోంది.

గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ దొరగారి మాస్టర్ ప్లాన్ ఇదే .. విజయశాంతి షాకింగ్ కామెంట్స్గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ దొరగారి మాస్టర్ ప్లాన్ ఇదే .. విజయశాంతి షాకింగ్ కామెంట్స్

జీహెచ్ఎంసీ ప్రజలకు , తెలంగాణ ప్రజలకు సవినయ మనవి .. విజయశాంతి పోస్ట్

జీహెచ్ఎంసీ ప్రజలకు , తెలంగాణ ప్రజలకు సవినయ మనవి .. విజయశాంతి పోస్ట్

ఇదే సమయంలో సీనియర్ రాజకీయ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్ సభ పై సెటైర్లు వేశారు. ఎవరైనా సీఎం కేసీఆర్ ను చూసుకోవాలంటే ఇప్పుడే చూసుకోవాలని, మళ్లీ ఎప్పటికి కనిపిస్తారో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయశాంతి జీహెచ్ఎంసీ ప్రజలకు , తెలంగాణ ప్రజలకు సవినయ మనవి అంటూ పోస్ట్ చేశారు. కెసిఆర్ గారి ఎన్నికల ప్రచారం బహిరంగ సభ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి దొర గారిని ఒకసారి చూసుకోండి. ఇంకా ఇప్పట్లో ఎన్నికలు లేకుంటే వారు కనబడేది లేదు వినపడేది అసాధ్యమంటూ సెటైర్ వేశారు.

సీఎం గారి కామెడీ వాగ్దానాల ద్వారా కొంత రిలీఫ్.. కానీ హామీల అమలు కష్టమే

సీఎం గారి కామెడీ వాగ్దానాల ద్వారా కొంత రిలీఫ్.. కానీ హామీల అమలు కష్టమే

ప్రజలు ఇప్పుడున్న కష్టాలకు సీఎం గారి కామెడీ వాగ్దానాల ద్వారా ఏదో కొంత రిలీఫ్ లభించే అవకాశం ఉండవచ్చు. హామీల అమలు ఎప్పట్లాగే ఏమీ ఉండదని మనందరికీ ఎప్పుడూ తెలిసిన కార్యక్రమమే అంటూ నేడు సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రజలకు కనిపించి హామీల వర్షం కురిపిస్తారు అని, ఇక ఈరోజు మాయమైతే మళ్లీ ఎన్నికల ముందే కనిపిస్తారు అంటూ విజయశాంతి కెసిఆర్ ను టార్గెట్ చేసి గట్టి పంచ్ వేశారు. సీఎం కేసీఆర్ వ్యవహార శైలి ఇదే విధంగా ఉంటుందని విజయశాంతి తన పోస్టు ద్వారా గ్రేటర్ వాసులకు చెప్పారు.

Recommended Video

Delhi Chalo : ఆరు నెలలకు సరిపడా రేషన్ తెచ్చుకున్నాం, తాడో పేడో తేల్చుకునే వెళ్తాం అంటున్న రైతులు
ఎల్బీ స్టేడియం లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ .. సర్వత్రా ఆసక్తి

ఎల్బీ స్టేడియం లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ .. సర్వత్రా ఆసక్తి

ఇక నేడు ఎల్.బి.స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి . సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల సభలు ప్రారంభించాలని నిర్ణయించిన టీఆర్ఎస్ నేతలు కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్ల నుంచి డివిజన్ కు మూడు వేల మంది చొప్పున తరలించాలని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించడానికి స్టేడియం లోపల బయట కూడా ఎల్ ఈ డి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కెసిఆర్ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతున్నాయి.

English summary
Senior politician Vijayashanti satires on CM KCR . The irony is that if anyone wants to see CM KCR, they should see him in today's meeting . or else he will never be seen or nor be hear till upcoming elections. Responding as a social media platform, Vijayashanti posted a humble request to the people of GHMC and the people of Telangana. Take a look at our Chief Minister KCR in election campaign public meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X