అమిత్ షా తో భేటీ అయిన వివేక్ ... లైన్ క్లియర్ ... కానీ అదే అడ్డు
పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తారు కానీ ఇప్పుడే కాదట. టీఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ కేటాయించకపోవటం తో మనస్తాపం చెందిన ఆయన గులాబీ పార్టీకి రాజీనామా చేశారు . గత ఎన్నికల ముందు సోదరుడైన వినోద్ కు టిక్కెట్ ఇవ్వని నాటినుండి నెలకొన్న వివాదం నేపధ్యంలో పార్టీకి గుడ్ బై చెప్పిన వివేక్ , సోదరుడు వినోద్ తో కలిసి బీజేపీ తీర్ధం పుచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది .

ఇక తాజాగా వివేక్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారని నేడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవనున్న ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని అంతా భావించారు. అక్కడ అమిత్ షా సమక్షంలోనే వివేక్ బీజేపీలో చేరనున్నారని ఆయనతో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన మరికొందరు నేతలు కూడా బీజేపీ లో చేరనున్నారని భావించారు కానీ ఆయన ఈ రోజు పార్టీ లో చేరలేదు .

పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ బీజేపీ జాతీయాధ్యక్షుడు నేడు అమిత్ షాని కలిశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నూతన అసెంబ్లీ, సచివాలయం కూల్చివేత నిర్ణయాలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోందని కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. సచివాలయ నిర్మాణం విషయంలో తెలంగాణా సర్కార్ చేస్తున్న పనులపై ఆయన కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో పాటు కలిసి అమిత్ షా దగ్గరకు వెళ్లడంతో.. ఇక కాషాయ జెండా కప్పుకోవచ్చునని అంతా భావించారు. కానీ ఆషాడ మాసం ఆయన చేరికకు అడ్డొచ్చింది అని తెలుస్తుంది. ఇది ఆషాఢ మాసం కావటంతో మంచి రోజులు లేవని , అందుకే ఆయన పార్టీ మారలేదని తెలుస్తుంది. ఏది ఏమైనా అమిత్ షా తో భేటీ అయిన వివేక్ ఆయనతో మాట్లాడారు. అయితే వచ్చే నెలలో శ్రావణ మాసం మంచి రోజులు కావటంతో వివేక్ సోదరులు ఇరువురూ బీజేపీ తీర్థం తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications