హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కందికొండకు అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్

|
Google Oneindia TeluguNews

సినీ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన కూతురు మాతృక తెలంగాణ మంత్రి కేటీఆర్‌‌కు లేఖ రాశారు. దీనిపై మంత్రి స్పందించారు. కందికొండ కుటుంబానికి గతంలోనూ అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఉంటామని ట్విట్టర్‌ వేదికగా ఆయన వెల్లడించారు. కందికొండ ఆరోగ్య, ఆర్థిక విషయాల గురించి తన ఆఫీసు సిబ్బంది.. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో మాట్లాడి సాయం అందిస్తారని పేర్కొన్నారు.

గత కొంతకాలంగా కందికొండ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో చికిత్సకు తన ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో కేటీఆర్‌ మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కందికొండ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయినప్పటికీ ఆర్థికంగా కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మోతీనగర్‌లో కందికొండ కుటుంబం ఉంటున్న ఇంటి అద్దె చెల్లించలేకపోవడంతో ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మాతృక ఆవేదన వ్యక్తం చేశారు.కేటీఆర్‌కు ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. గతంలో అండగా ఉన్నట్లే ఇప్పుడూ ఉంటామని ఆయన ట్విట్టర్‌లో వేదికగా తెలిపారు.

we help kandikonda family:minister ktr

తెలుగు సినిమాలతోపాటు తెలంగాణకు సంబంధించి ఎన్నో మరుపురాని పాటు రాసిన గేయ రచయిత కందికొండ యాదగిరి.. తెలుగు సినీ గేయ రచయితగా కందికొండకు మంచి పేరుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' చిత్రంలో 'మళ్లి కూయవే గువ్వ' పాటతో ఆయన గేయ రచయితగా మారారు. ఆ తర్వాత 'ఇడియట్‌'లో 'చూపుల్తో గుచ్చి గుచ్చి', 'సత్యం'లో 'మధురమే మధురమే', 'ఐయామ్‌ ఇన్‌ లవ్‌', 'పోకిరి'లో 'గల గల పారుతున్న గోదారిలా' 'జగడమే', 'లవ్‌లీ'లో 'లవ్‌లీ లవ్‌లీ' తదితర పాటలు రాశారు. చివరిగా 2018లో 'నీది నాది ఒకే కథ'లో రెండు పాటలు రాశారు. తెలంగాణ పండుగలైన బోనాలు, బతుకమ్మతోపాటు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే పలు పాటలను కందికొండ రాశారు.

English summary
we help lyricst kandikonda family telangana minister ktr tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X