హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీని ఖచ్చితంగా గద్దె దించుతాం: బీజేపీని ఏకిపారేసిన సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. మోడీ వచ్చి ఏదో చెప్తాడనుకుంటే ఏమి చెప్పలేదన్నారు. వేములవాడ రాజన్న ఏడుపాయల దుర్గమ్మ ఇదే కదా మోడీ చెప్పింది? అని ప్రశ్నించారు. దేశాన్ని జలగలా బీజేపీ పట్టిపీడిస్తోందన్నారు.

మోడీ ఏం మాట్లాడారో భగవంతునికే ఎరుక: కేసీఆర్

మోడీ ఏం మాట్లాడారో భగవంతునికే ఎరుక: కేసీఆర్

కేంద్రంలో అవినీతి అసమర్థ పాలన సాగుతోందని కేసీఆర్ విమర్శించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏమిలేదన్నారు. ఏం చేయబోతన్నారో చెప్పాలి కానీ అలాంటిదేమీ లేదన్నారు. మోడీ ఏం మాట్లాడారో ఆ భగవంతునికే తెలియాలన్నారు. మంత్రులు నోటిదూలతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
ఆ రోజే యశ్వంత్ సిన్హా వస్తే తాము సమావేశం పెట్టుకున్నామన్నారు.

మోడీ హయాంలోనే రూపాయి చారిత్రక పతనం: కేసీఆర్

మోడీ హయాంలోనే రూపాయి చారిత్రక పతనం: కేసీఆర్

తాను అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పలేదని కేసీఆర్ అన్నారు. అవినీతి విధానాలు, లక్షల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాను అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబివ్వాలన్నారు. కేంద్రం దేశానికేం చేయలేదు.. తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. దేశానికి సంబంధించిన దార్శనికత లేదన్నారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి పతనంపై మోడీ అడిగిన ప్రశ్ననే తాను ఇప్పుడు అడుగుతున్నానని కేసీఆర్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్లే చేశారు. మోడీ హయాంలోనే చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి పతనమైందన్నారు. డాలర్ మారకం 80 రూపాయలన్నారు.

అవినీతి, కుంభకోణాలంటూ మోడీ సర్కారుపై కేసీఆర్ విమర్శలు

అవినీతి, కుంభకోణాలంటూ మోడీ సర్కారుపై కేసీఆర్ విమర్శలు

మోడీ ప్రభుత్వం 8 ఏళ్లలో చేసిన ఒక్క మంచి పని చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్. కరెంటు, తాగునీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. దేశ రాజధానిలో కూడా నీళ్లు లేవని, కరెంటు కోతలేనన్నారు. తెలంగాణ జరిగిన దాంట్లో 20 శాతం కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగలేదన్నారు. దేశంలో ద్రవ్యోల్బణ పెరుగుదలను ఆపలేరని, భయంకర అవినీతి, కుంభకోణాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఏడాదికి 30 లక్షల ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆరోపించారు.

మోడీని గద్దెదించుతామన్న కేసీఆర్

మోడీని గద్దెదించుతామన్న కేసీఆర్


తెలంగాణ స్థాయికి కేంద్రం పనిచేసుంటే 11 లక్షల స్థానంలో 14 లక్షల కోట్ల ఆదాయం వచ్చి ఉండేదన్నారు. కేంద్రం వల్లే 3 లక్షల కోట్లు నష్టం వచ్చిందన్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారాలని చెప్తున్నాం.. మారుస్తం
ఒక్క విషయంలో మోడీకి థ్యాంక్స్. డబుల్ ఇంజిన్ సర్కారు అనే పదానికి.
తెలంగాణలో స్పీడ్ ఎక్కువ. తెలంగాణలో లాంటి సర్కారు కేంద్రంలో రావాలి
తెలంగాణ పర్ కెపిటీ 2లక్షల78వేల ఆదాయమని చెప్పారు.

English summary
We will change govt in Centre: CM KCR hits out PM Modi and BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X