హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ త‌ర్వాత ఎవ‌రు ముఖ్య‌మంత్రి..? తెలంగాణ స‌మాజంలో జ‌రుగుతున్న స‌రికొత్త చ‌ర్చ‌..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : కేసీఆర్ త‌ర్వాత రేసులో ఉన్న నేతలు వీరే !

హైద‌రాబాద్ ; తెలంగాణ రాజ‌కీయాల్లో తాజాగా ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతారు అనే వార్త ఆస‌క్తిని రేపుతోంది. అదికార గులాబీ పార్టీలో చంద్ర‌శేఖ‌ర్ రావు కేంద్ర రాజ‌కీయాల వైపు మొగ్గు చూపితే.. తెలంగాణ‌లో ఎవ‌రు ముఖ్య‌మంత్రి అనే చ‌ర్చ తారా స్థాయిలో జ‌రుగుతోంది. అంతే కాకుండా ప్ర‌జా ఫ్రంట్, బీజేపి త‌రుపున ఎవ‌రు ముఖ్య‌మంత్రి రేసులో ఉంటార‌నే అంశం పై కూడా జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి..! తెలంగాణ‌లో ఎవ‌రు ముఖ్య‌మంత్రి..!!

కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి..! తెలంగాణ‌లో ఎవ‌రు ముఖ్య‌మంత్రి..!!

జాతీయ రాజ‌కీయాల్లోకి రెడీ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ద‌క్షిణాధి నుంచి కేసీఆర్ స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడే అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఇలాంటి నేప‌థ్యంలో గులాబీ గూటి నుంచి సీఎం అభ్య‌ర్థి ఎవ‌రు? గ‌త ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన‌ట్లు ద‌ళితుల‌ను సీఎం చేస్తారా! వార‌సులుగా ముద్ర వేసుకున్న వారిలో ఎవ‌రికి ప్రాధాన్య‌త‌నిస్తారు. ఇవ‌న్నీ టీఆర్ఎస్ పార్టీలో నెల‌కొన్న సందేహాలు. కేసీఆర్ సీఎంగా ఉంటే ఓకే, ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. కానీ ఆయ‌న త‌ర్వాత ఎవ‌రు ముఖ్య‌మంత్రి అనేదే ఆస‌క్తి రేపుతోంది.

హ‌రీష్, కేటీఆర్ ల‌పై ప్ర‌జ‌ల మొగ్గు..! అనుకూలత వ్య‌క్తం చేస్తున్న‌తెలంగాణ ప్ర‌జ‌లు..!!

హ‌రీష్, కేటీఆర్ ల‌పై ప్ర‌జ‌ల మొగ్గు..! అనుకూలత వ్య‌క్తం చేస్తున్న‌తెలంగాణ ప్ర‌జ‌లు..!!

ప్ర‌తిప‌క్షాల‌కు ధీటైన స‌మాధానం చెప్ప‌గ‌ల రాజ‌కీయ ఉద్దండులు టీఆర్ ఎస్‌లో ఎవ‌రున్నారు. బూత‌ద్దం పెట్టి వెతికినా కేసీఆర్ తో స‌రితూగ‌గ‌ల నేత లేర‌నేది సొంత పార్టీ ఆలోచ‌న‌. కేటీఆర్‌, కూతురు క‌విత‌, అల్లుడు హ‌రీష్‌రావు వీరిలో ఎవ‌రు సీఎం అభ్య‌ర్థి అనే అనుమానాలు లేక‌పోలేదు. అందుకేనేమో, నిజామాబాద్ ఎంపీగా వున్న క‌విత‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగాల‌నే విష‌యాన్ని త‌న అనుచ‌రుల‌తో త‌ర‌చూ చ‌ర్చిస్తూ వ‌చ్చారు. కేటీఆర్ కూడా మూడేళ్లుగా అన్నీ తానై చ‌క్రం తిప్పుతున్నారు. గ్రేట‌ర్ వంటి మున్సిపల్ కార్పొరేష‌న్ నుంచి సిద్ధ‌ిపేట నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కూ ప‌ట్టునిలుపుకునే ప్ర‌య‌త్నాలు సాగిస్తూనే ఉన్నారు.

హ‌రీష్ చాణ‌క్యం.. కేటీఆర్ చ‌తుర‌త‌..! కేసీఆర్ ను మ‌రిపించే ఛాన్సెస్..!

హ‌రీష్ చాణ‌క్యం.. కేటీఆర్ చ‌తుర‌త‌..! కేసీఆర్ ను మ‌రిపించే ఛాన్సెస్..!

హ‌రీష్‌రావు రాజ‌కీయాల్లో ఎటువంటి ప్ర‌త్య‌ర్థుల్లేని నేత‌. కార్య‌క‌ర్త‌ల‌కే కాదు, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కూ అత్యంత ఆప్తుడు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎంగా ఎవ‌రైతే బావుంటుందంటూ, ఓ సంస్థ చేప‌ట్టిన సర్వేలో కేసీఆర్‌, హ‌రీష్ అంటూ జ‌నం త‌మ అభిప్రాయం వెలిబుచ్చారు. అప్ప‌ట్లోనే దాదాపు 25-30శాతం మంది ముఖ్యంగా యువ‌త హ‌రీష్‌కే ఓటేయ‌టం ఇందుకు నిద‌ర్శ‌నం. అటువంటి బ‌ల‌మైన నేత హ‌రీష్ కొద్దికాలంగా కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గానికే పరిమిత‌మ‌య్యారు. ఇదేంట‌ని ప్ర‌శ్నించిన వారికి సాగునీటి ప్రాజెక్టుల ప‌నిలో హ‌రీష్ బిజీగా వున్నారంటూ స‌ర్దిచెబుతున్నారు.

ప్ర‌తిప‌క్షాల‌నుండి కూడా స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కత్వం..! ముఖ్య‌మంత్రి స్థాయి నేత‌లు రెడి..!!

ప్ర‌తిప‌క్షాల‌నుండి కూడా స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కత్వం..! ముఖ్య‌మంత్రి స్థాయి నేత‌లు రెడి..!!

టీఆర్ఎస్ నుంచి హ‌రీష్ రావు, కేటీఆర్, ప్ర‌జా ఫ్రంట్ త‌రుపున ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బీజేపి త‌రుపున కిష‌న్ రెడ్డి, కె.ల‌క్ష్మ‌ణ్ ల పేర్లు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేసులో హ‌డావిడి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ త‌ర్వాత మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌రిపాలించేది ఎవ‌ర‌నేది కూడా చ‌ర్చ‌నీయాంశ‌మౌతోంది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రజాధ‌ర‌ణ క‌లిగిన రేవంత్ రెడ్డితో పాటు, అదిష్టానానికి న‌మ్మిన బంటులా ఉంటున్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి కూడా ముఖ్య‌మంత్రిగా మంచి అవ‌కాశాలు ఉన్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక బీజేపి ఒక వేళ కింగ్ మేక‌ర్ పాత్ర పోషించాల్సి వ‌స్తే కిష‌న్ రెడ్డి తో పాటు ల‌క్ష్మ‌ణ్ కూడా కీల‌క పాత్ర పోషించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అంతే కాకుండా అదిష్టానం అండ‌దండ‌ల‌తో ముఖ్య‌మంత్రి స్థాయివ‌ర‌కు వెళ్లే అవ‌కాశాలు కూడా లేక‌పోలేదు. మొత్తానికి తెలంగాణ‌లో కేసీఆర్ త‌ర్వాత ఎవ‌రు ముఖ్య‌మంత్రి అనే అంశం ప‌ట్ల తెలంగాణ స‌మాజంలో లోతైన చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
Telangana politics is making a fresh news. Any party wins Telangana Pre-election, Rewards the news about who will become chief minister. Chandrasekhar Rao is inclined towards central politics. The talk of Chief Minister in Telangana is on a scale level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X