• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకునేది ఎవ‌రు..? అభ్య‌ర్థుల మ‌ధ్య న‌రాలు తెగే ఉత్కంఠ‌..!

|
  KCR Cabinet : Who Are The Ministers Among TRS Candidates ? | Oneindia Telugu

  హైద‌రాబాద్: క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కేసీఆర్‌‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే కేసీఆర్ ప్రమాణ స్వీకార సమయంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు కనిపించకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం గమనించాల్సిన విషయం. కేసీఆర్ తో పాటు మంత్రిగా మహమూద్ అలీ కూడా ఈ రోజే ప్రమాణం చేశారు.

  మిగతా మంత్రులు

  మిగతా మంత్రులు

  మిగతా మంత్రులు మరికొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. అయితే గెలుపొందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే విషయంలో చర్చలు జోరందుకున్నాయి. మంత్రి పదవులు దక్కింది వీరికే అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి.

  కొత్త‌గా ఆరుగురికి అవ‌కాశం..! అద్రుష్టం ఎవ‌రిని విరించ‌నుందో..!!

  కొత్త‌గా ఆరుగురికి అవ‌కాశం..! అద్రుష్టం ఎవ‌రిని విరించ‌నుందో..!!

  కాగా మంత్రులుగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్ రెడ్డి ఉన్నారు. వీరితోపాటు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుండి గెలిచిన చామకూర మల్లారెడ్డి, మైనంపల్లి హనుమంత రావులకు కూడా మంత్రి పదవి లభించే అవకాశముంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఊహించని పరాజయం. దీంతో ఖమ్మం నుంచి రెండవసారి గెలిచిన అదే సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కుమార్ కు మంత్రి పదవి దక్కనుంది. కేటీఆర్ తో ఉన్న స్నేహబంధంతో పాటు కాంగ్రెస్ ఒక్కసీటు కూడా కమ్మ సామాజిక వర్గానికి కేటాయించలేదు. టీఆర్ఎస్ 6 సీట్లు కేటాయించి కమ్మ సామాజిక వర్గాలకు చెందిన ఓటు బ్యాంకును నర్మగర్భంగా కొల్లగొట్టారు. కాంగ్రెస్ ‘కమ్మ' సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా పువ్వాడ అజయ్ కి తెరాసలో మంత్రి పదవి రూపంలో కలసివచ్చింది.

  మహిళలకు ప్రాధాన్యత..! మంత్రి ప‌దవి చేప‌ట్ట‌నున్న అద్రుష్ఠ‌ల‌క్ష్మి ఎవ‌రు..?

  మహిళలకు ప్రాధాన్యత..! మంత్రి ప‌దవి చేప‌ట్ట‌నున్న అద్రుష్ఠ‌ల‌క్ష్మి ఎవ‌రు..?

  గత కాబినేట్ లో మహిళలకు ఎలాంటి పదవి ఇవ్వలేదనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుత్తాయి. దీంతో గులాబీ దళపతి కేసీఆర్ ఈ విమర్శలకు చెక్ పెట్టాలని భావించారు. గతంలో స్పీకర్ గా పనిచేసిన మధుసూదనాచారి ఓడిపోవడంతో ఆ స్థానానికి గతంలో డిప్యూటీ స్పీకర్ గా పద్మా దేవేందర్ రెడ్డి పేరు స్పీకర్ గా వినిపిస్తోంది. అలాగే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కు సునీత పేరు పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో సమాజిక కోణంలో కూడా సమతుల్యత పాటించనట్లు అయింది. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారినే కాకుండా ఎమ్మెల్సీలుగా ఉన్న వారిని కూడా మంత్రి వర్గంలోకి పరిగణనలోకి తీసుకోవాలని గులాబీ దళపతి భావిస్తున్నారు. అందుకోసం ఎలాంటి ఆరోపణలు లేని వారిని, విధేయులుగా ఉన్న వారి పేర్లను గులాబీ నేత బాగానే కసరత్తు చేస్తున్నారు. అయితే వారితో పాటు ఇటీవలే పార్టీ మారి ఎమ్మెల్యేలు అయిన వారి పేర్లు, ఎలాంటి పదవి ఆశించకుండా పనిచేసిన నిబద్ధత కలిగిన పలువురు పేర్లు, సామాజిక సమీకరణాలతో గులాబీ నేత కుస్తీ పూర్తి చేశారని తెలిసింది.

  దానంకి మంత్రివ‌ర్గంలో స్థానం లేన‌ట్టే..! పార్టీ సేవ‌ల‌కే ప‌రిమితం చేసే అవ‌కాశం..!

  దానంకి మంత్రివ‌ర్గంలో స్థానం లేన‌ట్టే..! పార్టీ సేవ‌ల‌కే ప‌రిమితం చేసే అవ‌కాశం..!

  తాజా జంప్ జిలానీలలో కాంగ్రెస్ నుంచి వచ్చి ఖైరతాబాద్ స్థానం నుంచి గెలిచిన దానం నాగేందర్ కు మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశం లేనట్లు తెలిసింది. అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు హైదరాబాద్ నుంచి గెలిచారు. దీంతో వారిని తప్పించి దానం నాగేందర్ కు మంత్రి పదవి దక్కే అవకాశం లేదు. అయితే ఆయన సేవలను పార్టీ పరంగా ఉపయోగించుకోవాలని గులాబీ నేత భావిస్తున్నారు. ఈ రకంగా సోషల్ మీడియాలో మెసేజీలు జోరుగా షి'కారు' చేస్తున్నాయి. చూడాలి గులాబీ బాస్ కీలక పదవుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

  English summary
  Discussions on who are in the seat of ministerial posts in the TRS MLAs. The minister's position has been won by the mass media in social media much publicity to the newly elected candidates.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X