హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

59 ఏళ్లు దాటిన పరిస్థితి ఏంటీ.. రైతు బీమా ఎందుకు వర్తించదు: షర్మిల విసుర్లు

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. రాష్ట్రంలో 59 సంవ‌త్స‌రాలు పైబ‌డిన రైతులు చ‌నిపోతున్నారని పేర్కొన్నారు. మరీ వారికి రైతు బీమా ఇవ్వ‌క‌పోవడంతో నష్టపోతున్నారని వివరించారు. వ‌య‌సు ప‌రిమితి అంశాన్ని స‌వ‌రించాల‌ని కోరారు. ఇదివరకు తమ పార్టీ ప్ర‌భుత్వానికి నాలుగు వారాలు సమయం కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. అదీ స‌వ‌రించ‌క‌పోతే కోర్టుకు వెళ్తామ‌ని చెప్ప‌ామని గుర్తుచేశారు. గతంలో చెప్పినట్టగా కోర్టును ఆశ్రయించ‌గా కోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఆరు వారాల్లోగా కౌంటర్ ఫైల్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Recommended Video

Ys Sharmila : బీమా జీవితానికా.? వయసుకా అని ప్రశ్నించిన YSRTP President | Oneindia Telugu
మొట్టికాయలు వేస్తే తప్ప..

మొట్టికాయలు వేస్తే తప్ప..


కేసీఆర్ ప్ర‌భుత్వానికి కోర్టు మొట్టికాయ‌లు వేస్తే గాని ప‌ని చేయ‌డం తెలియ‌దని షర్మిల అన్నారు. టీఎస్‌పీఎస్సీకి స‌భ్యుల‌ను నియ‌మించాల‌న్నా, కమిషన్లు, ఛైర్మన్లను నియ‌మించాల‌న్నా, కోవిడ్ టెస్టులు చేయాలన్న కోర్టు చెప్తేనే చేస్తారు. కేసీఆర్‌కు కోర్టు ద్వారా చెప్పించాల‌నుకున్నామని.. బీమా రైతుల‌కు న్యాయం చేయ‌లేన‌ప్పుడు ఎల్ఐసీతో ఇన్సూరెన్స్ చేయాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఎల్ఐసీ కాకపోతే ఇంకో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్ర‌భుత్వం ఎన్నుకోవాల్సింది. రైతులు చ‌నిపోతే పక్క రాష్ట్రాలు ఇస్తున్నట్లు రైతుల‌కు రూ.25 లక్షలు ప్రభుత్వమే చెల్లించాలని షర్మిల కోరారు,

కౌలు రైతుల గురించి వద్దు

కౌలు రైతుల గురించి వద్దు

కౌలు రైతుల గురించి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదన్నారు. కౌలు రైతును రైతే కాదని ఎలా అంటారు. కౌలు రైతుకు రైతుబంధు, రైతు బీమా ఇవ్వమని చెప్పడం ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వం కౌలు రైతుల‌ను గుర్తించాలని.. కౌలు రైతులు కూడా ప్ర‌తి సంక్షేమ పథకానికి అర్హులేనని చెప్పారు. రైతుల‌ను ప్ర‌భుత్వం అడుగ‌డుగునా మోసం చేస్తుందని షర్మిల మండిపడ్డారు. రుణ‌మాఫీ చేస్తామ‌ని చెప్పి చేయ‌లేదని.. రైతుల‌కు సబ్సిడీలు లేవు, యంత్ర ల‌క్ష్మీ లేదు. రైతు బంధు పేరుతో ఇస్తున్నది రూ.5 వేలు, పట్టుకుంటున్నది రూ.25 వేలు అని మండిపడ్డారు.

42 లక్షల మందికే ఎందుకు

42 లక్షల మందికే ఎందుకు

రాష్ట్రంలో రైతులు 66 ల‌క్ష‌ల మంది అని చెబుతున్న కేసీఆర్ బీమా మాత్రం 42 ల‌క్ష‌ల మ‌దికే ఎందుకు క‌డుతున్నారని ప్రశ్నించారు. నాడు బంగారు తెలంగాణ చేస్తామ‌ని అధికారంలోకి వ‌చ్చారు. ఇప్పుడు ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ఉండ‌గానే బంగారు భారతదేశం అంటున్నారు. రాష్ట్రంలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డం రాదు గాని దేశాన్ని పాలిస్తామంటూ మాట్లాడుతున్నారు. బంగారు తెలంగాణ చేస్తార‌ని ప్ర‌జ‌లు ఓట్లు వేసి గెలిపిస్తే.. బార్ల తెలంగాణ‌గా బీర్ల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రలో బడులు, గుడుల కంటే వైన్‌ షాపులే ఎక్కువ‌. కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల, అప్పుల, ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు.

English summary
why 59 years after farmers are not eligible to insurance. ysrtp chief sharmila asked cm kcr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X