దొర.. వ్యాక్సినేషన్ ఎందుకు నిలిపేశారు, కేసీఆర్‌పై బండి సంజయ్ విసుర్లు

కరోనా వైరస్ అంతో ఇంతో నివారణ వ్యాక్సిన్ వల్లే.. వ్యాక్సిన్ తీసుకుంటే 6 నెలల వరకు ఢోకా ఉండదు. అయితే అత్యధిక జనాభా గల భారతదేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో టీకాల ప్రక్రియ నిలిపివేసిన సంగతి తెలిసిందే. రెండో డోసు మాత్రం ఫర్ పెక్టుగా ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణ చర్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఇప్పుడే కాదు తొలి నుంచి ప్రభుత్వ తీరే ఇలా అంటూ ఆయన విరుచుకుపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఎందుకు ఆపారని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వ్యాక్సిన్‌ ఆపేశారు? అని అడిగారు. గాంధీ ఆస్పత్రికి వెళ్లి సీఎం కేసీఆర్‌ ఏం సాధించారని నిలదీశారు. కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఓ దొంగల ముఠా అంటూ బండి సంజయ్‌ మండిపడ్డారు. కేసీఆర్‌ గాంధీ ఆసుపత్రికి ఒక్కసారి వెళ్తే కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఏడు సార్లు వెళ్లి వచ్చారని తెలిపారు. వరంగల్‌ ఎంజీఎంకు ఈ రోజే ఎందుకు వెళ్లడం లేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

why should stop vaccination: bandi sanjay

ఫామ్ హౌజ్‌లో ఉంటున్నారని ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడితే తప్ప కేసీఆర్ బయటకు రాలేదని చెప్పారు. గాంధీ ఆస్పత్రి కేసీఆర్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని అడిగారు. కరోనా ఉధృతి కొనసాగుతోన్న ఈ సమయంలో ఎందుకు ఆయన స్పందించలేదని నిలదీశారు. ప్రజల ఆరోగ్యం అంటే కేసీఆర్‌కు చిన్నచూపు అని ధ్వజమెత్తారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఎన్నిసార్లు కోరినా స్పందించలేదని చెప్పారు. చివరికీ గవర్నర్‌కు కూడా ఇటీవల లేఖ రాశానని గుర్తుచేశారు. ఆయుష్మాన్ భారత్‌లో మాత్రం చేర్చుతున్నామని చెప్పి చేతులు దులిపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కరోనా వచ్చి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్న జనాలను వారు జలగల్లా పీక్కు తింటున్నారని చెప్పారు. లక్షలకు లక్షలు గుంజుతున్నారని చెప్పారు. ప్రాణమే ముఖ్యమని చాలా మంది అప్పో సప్పో చేసి.. కడుతున్నారని వివరించారు. అదే ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చితే పేద ప్రజలకు భారం తప్పేది కదా అని అడిగారు. ఇవేమీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+