7 నెలలకే ప్రేమ పెళ్లిలో విషాదం, వివాహిత బలవన్మరణం, భర్తపైనే అనుమానం..?
ఏం జరిగిందో తెలియదు.. కానీ నవ వధువు మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రేమించిన భర్తను శాశ్వతంగా వదిలి దూరమైపోయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగిన ఘటన కలకలం రేపింది. అయితే వివాహిత తల్లిదండ్రులు మాత్రం.. భర్తపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని హత్య చేసి.. నాటకాలు ఆడి ఉంటారని పేర్కొంటున్నారు.
కీసర పోలీసుస్టేషన్ పరిధిలో గల రాంపల్లిలో త్రినేయని-అక్షయ్ దంపతులు ఉంటున్నారు. వీరిద్దరూ పెద్దలను ఎదురించీ మరీ పెళ్లి చేసుకున్నారు. 7 నెలల క్రితం ఇద్దరూ ఒక్కటయ్యారు. కానీ కుటుంబ కలహాలో.. భార్య భర్తల మధ్య సఖ్యత లేదో తెలియని కానీ త్రినేయని ఆత్మహత్య చేసుకుంది. వివాహిత మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మెట్టినిళ్లుతోపాటు పుట్టినిళ్లు కూడా విషాదంలో మునిగిపోయింది.

భర్త అక్షయ్ తమ కూతురిని వేధిస్తున్నారని త్రినేయని పేరంట్స్ ఆరోపించారు. అతని వేధింపులు తాళ లేకే ఆత్మహత్య చేసుకుందన్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు త్రినేయని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నివేదికలో త్రినేయని మృతికి గల కారణం తెలిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications