హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫీజులు బాదేందుకు నో పర్మిషన్.. ఏటా 10 శాతమే, కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు

|
Google Oneindia TeluguNews

కరోనా వల్ల ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణిగాయి. వైరస్ ప్రభావం ఏమీ లేదు. దీంతో స్కూల్, కాలేజీలు నడుస్తున్నాయి. పిల్లలు వస్తున్నారు కదా.. అని స్కూల్స్ ఫీజల బాదుడు బాదుతుంది. గతేడాది.. ఈ సారి అంటూ ముక్కుపిండి మరీ వసూల్ చేస్తోంది. దీంతో ప్రైవేట్ పాఠశాలల ఫీజులకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక ప్రతిపాదనలు చేసింది.

10 శాతం మాత్రమే..

10 శాతం మాత్రమే..

ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు ఫీజులను ఏడాదికి గరిష్ఠంగా 10 శాతం మాత్రమే పెంచాలని.. అడ్మిషన్‌ ఫీజు, ట్యూషన్‌ ఫీజుల రూపంలో మాత్రమే వసూలు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం స్పష్టంచేసింది. ఇతర ఫీజులు చెల్లించడమనేది విద్యార్థులకు ఐచ్ఛికమే కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభం, ఫీజుల నియంత్రణ, మన ఊరు-మన బడి వంటి అంశాలపై ఏర్పాటయిన మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 2న సమావేశమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లందరికీ బయోమెట్రిక్‌ హాజరు విధానం, టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టడం, టెట్‌ నిర్వహణ వంటి అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేసింది. సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను తాజాగా సిద్ధం చేశారు.

 కమిటీ.. వీరే సభ్యులు

కమిటీ.. వీరే సభ్యులు

పాఠశాలల్లో ఫీజుల నిర్ధారణ, నియంత్రణకు స్కూల్‌ లెవల్‌ ఫీజు కమిటీలు ఏర్పాటు చేయాలని కోరింది. ఈ కమిటీలో పాఠశాల యాజమాన్య ప్రతినిధి, ప్రిన్సిపాల్‌, టీచర్లు, తల్లిదండ్రులు కలిపి మొత్తం 10 మంది ఉండాలి. ఏటా ఫీజులను 10 శాతం లోపే పెంచాలి. అడ్మిషన్‌, ట్యూషన్‌ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. ఇతర ఫీజుల వసూలు విద్యార్థుల ఆప్షన్‌కే వదిలేయాలి. ఒకవేళ స్కూల్‌ లెవల్‌ కమిటీ ఫీజులను ఖరారు చేయకపోతే రాష్ట్ర స్థాయిలో స్టేట్‌ లెవల్‌ ఫీజుల నియంత్రణ కమిటీ ఉండాలి. దీనిని ప్రభుత్వం నియమించాలి. పాఠశాల స్థాయి కమిటీలో యాజమాన్యం ప్రతినిధి చైర్‌పర్సన్‌గా ఉంటారు. పాఠశాల ప్రిన్సిపాల్‌.. సెక్రటరీగా వ్యవహరిస్తారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు టీచర్లు సభ్యులుగా ఉంటారు. వీరిని యాజమాన్యమే నామినేట్‌ చేస్తుంది. పేరెంట్‌ టీచర్‌ అసొసియేషన్‌ (పీటీఏ) నుంచి ఐదుగురు తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒకరు మైనారిటీ, ఇద్దరు ఇతరులు సభ్యులుగా ఉండాలి.

హైకోర్టు రిటైర్డ్ జడ్జీ

హైకోర్టు రిటైర్డ్ జడ్జీ


రాష్ట్ర స్థాయి ఫీజు నియంత్రణ కమిటీకి ప్రభుత్వం నామినేట్‌ చేసిన హైకోర్టు రిటైర్డ్‌ జడ్జీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌, డైరెక్టర్‌ సభ్యులుగా ఉంటారు. విద్యారంగంలో విశేష అనుభవమున్న విద్యావేత్తను సభ్యుడిగా ప్రభుత్వం నియమిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరికీ త్వరలోనే బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సూచించింది. గతంలో ఈ విదానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు. రాష్ట్రంలో టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టాలనే అంశం చాలా కాలంగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనిని కూడా పూర్తి చేయాలని ఉపసంఘంలో నిర్ణయించారు. వీటితోపాటు విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలో ఫస్ట్‌ క్లాసులో చేరడానికి ముందు ప్రిపరేటరీ క్లాసులు నిర్వహించాలని ప్రతిపాదించారు.

Recommended Video

Telangana Budget 2022 Highlights | Oneindia Telugu
 వీరు సంతకం చేయాలి..

వీరు సంతకం చేయాలి..


మన ఊరు-మన బడి పథకం కింద చేపట్టే పనులకు సంబంధించి చెల్లింపుల విషయంలో చెక్కులపై స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ చైర్మన్‌తోపాటు సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. తొలి దశలో హైదరాబాద్‌లో ప్రతి నియోజకవర్గంలో 15 స్కూళ్లను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష మళ్లీ నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అయితే ఎప్పటిలోగా నిర్వహిస్తామనే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

English summary
yearly 10 percent hike in private school fees cabinet sub committee proposal to telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X