హైదరాబాద్ మేయర్‌కు కరోనా పరీక్షలు..; వైరస్ సోకి యువ జర్నలిస్టు మృతి..
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆయనకు నెగటివ్‌గా తేలింది. ఇటీవల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఆయన టీ తాగారు. అయితే అదే హోటల్లో పనిచేస్తున్న వంట మాస్టర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. ముందు జాగ్రత్తగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో నెగటివ్‌గా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్‌లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం(జూన్ 1) మనోజ్ అనే ఓ యువ జర్నలిస్ట్ కూడా కరోనాతో మృతి చెందడంతో ఆందోళన మరింత పెరిగింది. మాదన్న పేటకు చెందిన మనోజ్ పలు టీవీ ఛానళ్లలో క్రైమ్ రిపోర్టుగా పనిచేశారు. కాగా, ఇప్పటివరకూ తెలంగాణలో 3496 కరోనా కేసులు నమోదవగా.. ఒక్క హైదరాబాద్‌లోనే అత్యధికంగా 2096 కేసులు నమోదయ్యాయి.

Recommended Video
మొత్తంగా ఇప్పటివరకూ 1710 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా.. 1663 యాక్టివ్ కేసులు మాత్రమే కొనసాగుతున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 123కి చేరుకుంది. కొద్దిరోజులుగా వరుసగా 100కి పైనే కేసులు నమోదవుతుంటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం రాష్ట్రంలో 148 కేసులు నమోదవగా.. ఇందులో 116 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. శనివారం నమోదైన 206 కేసుల్లో 152 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications