హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరదలు షర్మిల కామెంట్స్: మరీ కవిత ఏమవుతుంది, వైఎస్ఆర్ టీపీ చీఫ్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

వైఎస్ షర్మిల స్వరం పెంచారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని ఏకిపారేశారు. ఏకంగా శునకం అనేశారు. సభ్యత, సంస్కారం లేదా అంటూ ఫైరయ్యారు. తనను మరదలు అనడంపై ఓ రేంజ్‌లో ఫైరయిన.. షర్మిల.. మరి కవిత ఏమవుతుందని అడిగారు. ప్రతిపక్ష/ ఇతర పార్టీల నేతలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. ఈ కుక్కకి కవిత ఏం అవుతుందో సమాధానం చెప్పాలని షర్మిల నిలదీశారు.

చందమామ..

చందమామ..

చందమామను చూసి కుక్కలు మొరుగుతాయని ఆమె తెలిపారు. సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్‌లో ఉన్నాయని ఫైరయ్యారు. కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడకు పోతుందని ఆమె అన్నారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరిందని షర్మిలపై మంత్రి నిరంజన్‌ రెడ్డి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. షర్మిల పాదయాత్ర కొనసాగిస్తూనే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.

మరదలు

మరదలు

దీనిపై నిరంజన్‌ రెడ్డి బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్పందించారు. ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే ఆమె డిమాండ్‌ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని మంత్రి ఆరోపించారు.ఇటీవల షర్మిల పలు సందర్భాల్లో షర్మిల మాట్లాడారు. వైఎస్ఆర్ పాల‌న‌లో నిరుద్యోగులు, విద్యార్థులు క్షేమంగా ఉన్నారని షర్మిల అన్నారు. ఏ ఒక్కరు ఆత్మహ‌త్య చేసుకోలేదని చెప్పారు. ఐదేళ్లలో మూడుసార్లు నోటిఫికేష‌న్లు ఇచ్చి, ల‌క్షల ఉద్యోగాలు భ‌ర్తీ చేశారని చెప్పారు. 2008లో జంబో డీఎస్సీతో 54 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేసిన మ‌హ‌నీయుడు వైయ‌స్ఆర్ అని గుర్తుచేశారు. ప్రభుత్వ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలోనూ 11ల‌క్షల ఉద్యోగాలు సృష్టించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేష‌న్ల ద్వారా పేద‌ల‌కు లోన్లు ఇచ్చి, స్వయం ఉపాధి క‌ల్పించారు. పేద‌వాడికి జ‌బ్బు చేస్తే ఆ కుటుంబం మొత్తం అప్పుల‌ పాల‌వుతుంద‌ని, ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించారు. ఫోన్ చేసిన 20 నిమిషాల‌కే పేద వాడి ఇంటి ముందు అంబులెన్స్ వచ్చేలా చేసిన గొప్ప నాయ‌కుడు మ‌న వైఎస్ఆర్ అని చెప్పారు.

Recommended Video

ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu
కొలువుల లెక్క

కొలువుల లెక్క


ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 45 ల‌క్షల ఇండ్లు నిర్మిస్తే.. వైఎస్ఆర్ 46 ల‌క్షల ప‌క్కా ఇండ్లు క‌ట్టించి ఇచ్చారని చెప్పారు. ఒక్క చార్జీ కూడా పెంచ‌కుండా సంక్షేమ పాల‌న అందించిన రికార్డు సీఎం వైఎస్ఆర్ అని చెప్పారు. 64 ల‌క్షల రైతుల‌కు రుణ‌మాఫీ చేశారు. రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వాల‌ని తొలుత ఆలోచ‌న చేసిన నాయ‌కుడు వైఎస్ఆర్ అని వివరించారు. మ‌హిళ‌ల‌కు పావ‌లా వ‌డ్డీకే రుణాలు ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిల‌బ‌డేలా చేశారు. మ‌హిళ‌ల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారు. పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య అందించాల‌నే ఉద్దేశంతో ఎన్నో విద్యాసంస్థలు, వ‌ర్సిటీలు నెల‌కొల్పారు. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ద్వారా ఉచిత విద్య అందించారు. వైఎస్ఆర్ హ‌యాంలో ఎంతో మంది పేద‌లు.. డాక్టర్లు, ఇంజ‌నీర్లు అయ్యారు. వైయ‌స్ఆర్ గారు ఏం చేసినా అద్భుతంగానే ఉండేది.

English summary
ysrtp chief ys sharmila counter attack to telangana minister niranjan reddy. she is sister-in-law he alleges recently
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X