షర్మిల రైతు వేదన దీక్ష వాయిదా.. అనుమతి ఇవ్వని పోలీసులు, కారణమిదే

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. దీంతో 72 గంటల రైతు వేదన నిరహార దీక్ష చేస్తానని ఆమె ప్రకటించారు. హైద‌రాబాద్ ధ‌ర్నాచౌక్‌, ఇందిరాపార్క్ వ‌ద్ద శుక్ర‌వారం దీక్ష చేయాలని అనుకున్నారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తాత్కాలికంగా వాయిదా పడింది.

ఎన్నికల కోడ్

ఎన్నికల కోడ్

తొమ్మిది జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్ కోడ్ అమ‌లులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల్లో నిరాహార దీక్ష చేసే వీలు లేకపోయింది. శనివారం రోజున 72 గంట‌ల నిరాహార దీక్షను ధ‌ర్నాచౌక్‌, ఇందిరాపార్క్ వ‌ద్ద‌ చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు పోలీసుల‌ను అనుమ‌తి ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని మీడియా మిత్రులు, రైతులు, ప్ర‌జ‌లు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గ‌మ‌నించాలని పార్టీ కోరింది.

టీఆర్ఎస్ ఆందోళనలు

టీఆర్ఎస్ ఆందోళనలు

ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్‌ ఆందోళన చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్‌ షర్మిల దీక్షకు సెంట్రల్‌ జోన్‌ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ధాన్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్‌ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టనుంది. అందులో భాగంగా.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ దగ్గర కూడా ధర్నా తలపెట్టారు. దీని కోసం అనుమతి కోరుతూ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పోలీసులకు పర్మిషన్ అప్లై చేశారు. దానిని పరిశీలించిన సెంట్రల్‌ జోన్‌ పోలీసులు.. కొన్ని షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. దీంతో షర్మిల దీక్షకు అనుమతి లభించలేదు.

ఆగ్రహాం

ఆగ్రహాం

అంతకుముందు కేసీఆర్‌పై షర్మిల విరుచుకుపడ్డారు. ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే..? లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు. లక్షా 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారని అడిగారు. ఇంకో 80 వేలు మళ్లీ ఇచ్చేస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నాడు. 80 వేల ఉద్యోగాలు ఏమిటి..? పీఆర్సీ ప్రకారం 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం లక్ష 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకారం లక్ష 91వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఉద్యోగాలకు కూడా కేంద్రమే ఆలస్యం చేస్తోందని కేసీఆర్ చెబుతున్నాడు. అయ్యా కేసీఆర్ కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసి 4 ఏండ్లు అయిపోయింది కదా..? ఇప్పటి వరకు మీరు దానికి కావాల్సిన నోటిఫికేషన్లు, సిబ్బందిని ఎందుకు భర్తీ చేయలేదు అని అడిగారు. ఆలస్యం చేస్తున్నది మీరా..ఇంకెవరైనా..? ఉద్యోగాలు ఇవ్వాలని మీకు సోయి ఉంటే వీల్లందరికీ ఉద్యోగాలు ఎప్పుడో వచ్చేవి. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు కనుకనే కదా..ఇంత మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంది. కేసీఆర్ పాలనలో డిగ్రీలు, పీజీలు చదివిన నిరుద్యోగులు హమాలీ పని, పత్తి కూలీకి, ఆటో తోలుతూ పనులు చేసుకుంటున్నారు. 8 వేలకు ఆటో డ్రైవర్లుగా పోతున్నారు. ఇందుకేనా డిగ్రీలు, పీజీలు చదివింది..? కూలీ నాలీ చేసి వారిని కష్టపడి చదివించుకుంది ఇందుకేనా..? అప్పులు చేసి వారిని చదివించుకుంది హమాలీ పనికి పంపేందుకేనా..? మన పిల్లలు హమాలీ పనిచేయాలని మంత్రి కూడా అదే చెబుతున్నాడు. అంటే మన పిల్లలు హమాలీ పని చేసుకోవాలి. కేసీఆర్ పిల్లలు రాజ్యాలు ఏలాలని ఫైరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+