• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తొలి టెస్ట్‌కు ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఔట్: టీమిండియాలో ఆ ఆల్‌రౌండర్ డౌట్: కోహ్లీ ఆడేది ఒక్క మ్యాచే

|

అడిలైడ్: భారత్-ఆస్ట్రేలియాల జట్ల మధ్య వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఫార్మట్ సిరీస్‌ మ్యాచ్‌లు అప్పుడే ముగిశాయి. ఇక రెండు జట్లూ సుదీర్ఘమైన టెస్ట్ సిరీస్‌ కోసం సమాయాత్తమౌతున్నాయి. గవాస్కర్-బోర్డర్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఇక ఆరంభం కానుంది. తొలి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 17వ తేదీన ప్రారంభం కాబోతోంది. అడిలైడ్ దీనికి వేదికగా మారింది. ఈ పరిస్థితుల్లో రెండు జట్లూ గాయల బెడదను ఎదుర్కొంటున్నాయి. అయిదు రోజుల పాటు సాగే టెస్ట్ మ్యాచ్‌లో నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్ల కొరతను ఎదుర్కొంటున్నాయి.. భారత్-ఆస్ట్రేలియా జట్లు. క్రీజులో పాతుకునిపోయి, సుదీర్ఘమైన ఇన్నింగ్‌ను ఆడే సత్తా ఉన్న స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్లు దూరం అవుతున్నారు.

తొలి టెస్ట్‌కు డేవిడ్ వార్నర్ అవుట్

తొలి టెస్ట్‌కు డేవిడ్ వార్నర్ అవుట్

అడిలైడ్‌లో ఈ నెల 17వ తేదీన ఆరంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ దూరం అయ్యాడు. అడిలైడ్ టెస్ట్‌లో అతను ఆడట్లేదని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. గజ్జల్లో గాయం కారణంగా డేవిడ్ వార్నర్ తొలి టెస్ట్‌లో ఆడట్లేదని పేర్కొంది. బాక్సింగ్ టెస్ట్ మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఫీల్డింగ్ చేస్తూ గాయ పడిన డేవిడ్ వార్నర్ టీ20 సిరీస్‌కు దూరం అయ్యాడు. రెండో వన్డే ఆడే సమయంలో అతను గాయపడ్డాడు. మూడో వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కూ అందుబాటులో లేకుండా పోయాడు. మూడో వన్డే సహా.. టీ20 సిరీస్‌లోని తొలి రెండింటినీ టీమిండియా గెలిచిన విషయం తెలసిందే.

బాక్సింగ్ టెస్ట్ నాటికి..

బాక్సింగ్ టెస్ట్ నాటికి..

ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని డేవిడ్ వార్నర్ తెలిపాడు. గాయం నుంచి కోలుకున్నానని పేర్కొన్నాడు. బాక్సింగ్ టెస్ట్ మ్యాచ్ నాటికి పూర్తి ఫిట్‌నెస్‌ను సాధిస్తానని, జట్టుతో కలుస్తానని చెప్పాడు. గాయం తిరగబెట్టకూడదనే ఉద్దేశంతోనే తొలి టెస్ట్ మ్యాచ్‌కు దూరం అయ్యానని, బాక్సింగ్ టెస్ట్‌లో వందశాతం ఆడతాననే విశ్వాసం కలుగుతోందని వార్నర్ స్పష్టం చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం.. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తరువాత 10 రోజుల పాటు నెట్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. వార్నర్ స్థానంలో ఎవరిని రీప్లేస్ చేస్తారనేది తేలాల్సి ఉంది.

రవీంద్ర జడేజా ఆడేది అనుమానమే..

రవీంద్ర జడేజా ఆడేది అనుమానమే..

టీమిండియాను కూడా గాయాలు వేధిస్తున్నాయి. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తొలి టెస్ట్‌లో ఆడేది అనుమానమే. హ్యామ్‌స్టింగ్ గాయంతో అతను బాధపడుతున్నాడు. తొడ కండరాలు పట్టేయడంతో రవీంద్ర జడేజా ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్‌లల్లో ఆడలేదు. ఆ తరువాత ఎలాంటి వామప్ మ్యాచుల్లోనూ కనిపించలేదు. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌కు దాదాపుగా దూరమైనట్లేనని తెలుస్తోంది. కాంకషన్ ప్రొటోకాల్ ప్రకారం కూడా అతను గవాస్కర్-బోర్డర్ టెస్ట్ సిరీస్‌లో ఆడే అవకాశం లేదు. తలకు బంతి తగిలితే.. కాంకషన్ ప్రొటోకాల్ ప్రకారం.. తప్పనిసరిగా ఏడు నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.

టిమ్ పెయిన్ కేప్టెన్సీలో..

టిమ్ పెయిన్ కేప్టెన్సీలో..

నాలుగు మ్యాచ్‌ల గవాస్కర్-బోర్డర్ టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకు టిమ్ పెయిన్ సారథ్యాన్ని వహిస్తున్నాడు. అబాట్, జో బర్న్స్, పాట్ కమిన్స్, కామెరూన్ గ్రీన్, హేజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, మార్నుస్ ల్యాంబుషేన్, నాథన్ లియాన్, మిఛెల్ నెసెర్, జేమ్స్ ప్యాటిన్సన్, విల్ పుకోవ్‌స్కీ, స్టీవ్ స్మిత్, మిఛెల్ స్టార్క్, మిఛెల్ స్వెప్‌సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్‌ను తొలుత జట్టులోకి తీసుకున్నారు. ఇందులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. తొలి టెస్ట్ మ్యాచ్ తరువాత కేప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరుగు ప్రయాణం కానున్నాడు. ఈ పర్యటనలో అతనికి అదే చివరి మ్యాచ్ అవుతుంది.

English summary
Australia opening batsman David Warner has been ruled out of next week's series-opening Test against India in Adelaide and will target a return for the second Boxing Day test in Melbourne, Cricket Australia (CA) said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X