• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఛీఛీ..ఐర్లాండ్ టీమ్ కంటే ఘోరంగా: టీమిండియా పరువు మొత్తం తీసిన పేసర్లు: కుమ్మేసిన కమిన్స్

|

అడిలైడ్: అడిలైడ్ టెస్ట్.. భారత క్రికెట్ అభిమానులు బహుశా ఇప్పట్లో ఈ మ్యాచ్‌ను మరిచిపోలేకపోవచ్చు. ఓ పీడకలలా కొన్నేళ్ల పాటు వెంటాడే అవకాశం ఉందీ మ్యాచ్. టెస్ట్ క్రికెట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరును నమోదు చేసింది భారత క్రికెట్ జట్టు. 36 పరుగులకే కుప్పకూలిపోయింది. టెయిలెండర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ షమీ రిటైర్డ్ హర్ట్ కావడంతో 36 పరుగుల వద్ద టీమిండియా తన రెండో ఇన్నింగ్‌ను డిక్లేర్డ్ చేయాల్సి వచ్చింది. 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఫోర్‌తో ఇన్నింగ్‌ను ఆరంభించారు.

ఊచకోత: తోక ముడిచిన కోహ్లీసేన: గల్లీ క్రికెటర్ల కంటే హీనం: టెస్ట్ చరిత్రలో దారుణ రికార్డ్ఊచకోత: తోక ముడిచిన కోహ్లీసేన: గల్లీ క్రికెటర్ల కంటే హీనం: టెస్ట్ చరిత్రలో దారుణ రికార్డ్

 36 పరుగులకే..

36 పరుగులకే..

ఒక వికెట్ నష్టానికి తొమ్మది పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడోరోజు ఇన్నింగ్‌ను ఆరంభించిన కోహ్లీసేన.. ఆసీస్ పేసర్ల ధాటికి చెల్లాచెదురైపోయింది. 11వ ఓవర్‌లో రెండో బంతికి చేతేశ్వర్ పుజారా అవుటైన తరువాత ప్రారంభమైన వికెట్ల పతనం. బ్రేకుల్లేకుండా సాగింది. 19 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. 19 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయిన జట్టు ఇప్పటిదాకా ఏదీ లేదు. జింబాబ్వే లాంటి పసికూన జట్లు కూడా ఇదివరకెప్పుడూ ఇంత దారుణంగా వికెట్లను సమర్పించుకోలేదు.

మొబైల్ నంబర్ కాదది. టీమిండియా స్కోర్‌బోర్డ్

మొబైల్ నంబర్ కాదది. టీమిండియా స్కోర్‌బోర్డ్

4,9,2,0,4,0,8,4,04,1.. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు చేసిన స్కోర్ అది. మొబైల్ ఫోన్ నంబర్లను తలపించింది. ఏ ఒక్కరు కూడా సింగిల్ డిజిట్‌ను అందుకోలేకపోవడం ఈ ఇన్నింగ్ స్పెషాలిటీ.. మరి. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే టాప్ స్కోర్..బ్యాటింగ్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తొమ్మిది వికెట్ల నష్టానికి 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహ్మద్ షమీ రిటైర్డ్ హర్ట్‌‌గా వెనుతిరడంతో ఇన్నింగ్‌ను డిక్లేర్ చేయాల్సి వచ్చింది.

కుమ్మేసిన కమిన్స్..

కుమ్మేసిన కమిన్స్..

ఇద్దరు పేస్ బౌలర్లు.. టీమిండియా పరువు మొత్తం తీసేశారు. బ్యాలెన్స్ ఏమీ ఉంచలేదు. మూడో రోజు తొలి ఓవర్ నుంచే చెలరేగిపోయారు. నిప్పులు చెరగిన బంతులకు అసలు సిసలు నిర్వచనం ఇచ్చారు ఆస్ట్రేలియా పేస్ బౌలర్లు. ప్యాట్ కమ్మిన్స్, హేజిల్‌వుడ్ చెలరేగిపోయారు. ఇద్దరు వికెట్లను పంచుకున్నారు. అయిదు ఓవర్లలో ఎనిమిది పరుగులను మాత్రమే ఇచ్చి అయిదు వికెట్ల హాల్‌ను అందుకున్నాడు హేజిల్‌వుడ్. 10 ఓవర్లలో 21 పరుగులకు నలుగురిని పెవిలియన్ చేర్చాడు పాట్ కమ్మిన్స్. వారిద్దరి ధాటికి ఎలా ఆడాలో కూడా మర్చిపోయినట్టు కనిపించారు టీమిండియా బ్యాట్స్‌మెన్లు.

 ఐర్లాండ్ కంటే దారుణంగా..

ఐర్లాండ్ కంటే దారుణంగా..

టెస్టు క్రికెట్‌లో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్ల జాబితాలో భారత క్రికెట్ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. బాధాకరం ఏమిటంటే. ఐర్లండ్ కంటే కూడా తక్కువ స్కోర్‌ను అందుకోవడం. ఆధునిక క్రికెట్‌లో అత్యల్ప స్కోర్‌ను అందుకున్న మూడో జట్టుగా నిలిచింది. ఇంతకుముందు-2002లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌పై 36 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2019లో ఐర్లాండ్.. ఇంగ్లాండ్ మీద 38 పరుగులు చేసింది. ఈ ఏడాది ఆ డ్యూటీని టీమిండియా తీసుకుంది. ఆస్ట్రేలియాలపై 36 పరుగుల అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది.

మొత్తం జాబితా ఇదే..

మొత్తం జాబితా ఇదే..

ఇప్పటిదాకా టెస్టుల్లో అత్యల్ప స్కోరును అందుకున్న జట్ల జాబితాలో న్యూజీలాండ్-26 (1955), దక్షిణాఫ్రికా-30 (1896), దక్షిణాఫ్రికా-30 (1924), దక్షిణాఫ్రికా-35 (1899), దక్షిణాఫ్రికా-36 (1932), ఆస్ట్రేలియా-42 (1888), న్యూజీలాండ్-42 (1946), భారత్-42 (1974) ఉన్నాయి. ఆధునిక క్రికెట్‌లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, భారత్..మరోసారి ఆ అన్ వాంటెడ్ రికార్డు‌ను అందుకున్నాయి.

English summary
Resuming day three at 9/1, India lost the wickets of Jasprit Bumrah (2) and Cheteshwar Pujara (0) in quick succession as Pat Cummins sent both the batsmen back to the pavilion. In the very next over of Pujara's dismissal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X