వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడేళ్ళ బాలుడి ఊపిరితిత్తుల నుండి స్ప్రింగ్ వెలికి తీసిన వైద్యులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని భీవండికి చెందిన ఏడేళ్ల బాలుడి ఊపిరితిత్తుల నుండి సుమారు 1.5 సెం.మీ స్ప్రింగ్‌ను వైద్యులు సురక్షితంగా బయలకు వెలికి తీశారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆసుపత్రిలో కోలుకొంటున్నాడని వైద్యులు చెప్పారు.

టాయ్‌గన్‌లోని స్ప్రింగ్‌ను ఏడేళ్ళ బాలుడు పొరపాటున మింగాడు. ఈ స్ప్రింగ్ స్వర పేటిక నుండి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. అయితే ఈ విషయాన్ని ఆ బాలుడు తల్లిదండ్రులకు కూడ చెప్పలేదు. అయితే తీవ్రంగా దగ్గుతున్న విషయాన్ని గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్ళారు.

1.5-cm-long steel spring gets stuck in 7-year-olds lungs in Mumbai

అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు బాలుడి ఊపిరితిత్తుల్లో స్ప్రింగ్‌ ఉన్న విషయాన్ని గుర్తించారు. అయితే ఈ స్ప్రింగ్‌ను ఆపరేషన్ చేసి తీస్తే బాలుడి పరిస్థితి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని తొలుత వైద్యులు నిరాకరించారు.బయోస్కోపీ ద్వారా స్ప్రింగ్‌ను తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు గుర్తించారు. బాలుడు కోలుకొంటున్నట్టు వైద్యులు ప్రకటించారు.

చిన్న పిల్లలు ఆడుకొనే సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకపోతే ఈ రకమైన ప్రమాదాలు చోటు చేసుకొనే అవకాశం ఉంటుందన్నారు.

English summary
A seven-year-old kid in Bhivandi near Mumbai is in a serious condition after he swallowed a spring in a toy gun. The child while playing with his toy gun put the spring in his mouth which he mistakenly swallowed. The spring got stuck in his lungs through his windpipe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X