విమానం మరుగుదొడ్డిలో కేజీ బంగారం
న్యూఢిల్లీ: విమానంలో బంగారు అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. తనిఖీ అధికారులు పట్టుకుంటారని భయపడిన ఆ వ్యక్తి బంగారం తీసుకు వెళ్లి విమానంలోని మరుగుదొడ్డిలో దాచి పెట్టి చివరికి చిక్కి పోయాడు.
విమాన సిబ్బందికి అనుమానం వచ్చి తనిఖీలు చెయ్యగా ఆ స్మగ్లర్ అసలు విషం బయటపడింది. కస్టమ్స్ అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గురువారం దుబాయ్ నుంచి కొచ్చికి స్పైస్ జెట్ విమానం బయలుదేరింది. మార్గం మధ్యలో ప్రయాణికుడు పదేపదే మరుగుదొడ్డి దగ్గరకు వెళ్లి వస్తున్నాడు.

విమాన సిబ్బందికి అనుమానం వచ్చింది. అయినా అతనిని ఏమి ప్రశ్నించలేదు. అయితే అతను పదేపదే మరుగుదొడ్డికి వెలుతుండటంతో విమాన సిబ్బంది పై అధికారులను సంప్రదించారు. తరువాత విమాన సిబ్బంది మరుగుదొడ్డిలోకి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు.
మరుగుదొడ్డిలోని టిష్యూ పేపర్ బాక్స్ వెనుక పేపర్ లో చుట్టి దాచి ఉంచిన కిలో బంగారు కడ్డీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొచ్చిలో విమానం ల్యాండ్ అయిన తరువాత కస్టమ్స్ అధికారులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications