ఎన్‌కౌంటర్‌కు మావోల ప్రతీకారం: తెలంగాణ బస్సుకు నిప్పు, కానిస్టేబుల్ కాల్చివేత..
రాయ్‌పూర్: తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దులో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌కు మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకున్నారు. సోమవారం అర్థరాత్రి సుకుమా జిల్లా డోర్నపాల్ మండలంలోని పెద్దకుడ్తిలో తెలంగాణ ఆర్టీసీ బస్సుకు మావోలు నిప్పు పెట్టారు.
Recommended Video

హైదరాబాద్ నుంచి జగదల్‌పూర్ వెళ్తున్న బస్సును అడ్డుకుని.. ప్రయాణికులను కిందకు దించేసి బస్సుకు నిప్పు పెట్టారు. బస్సుతో పాటు మరో ప్రైవేటు బస్సు, ట్రాక్టర్, మూడు లారీలకు కూడా నిప్పు పెట్టారు. తగలబెట్టిన ఆర్టీసి బస్సును హైదరాబాద్ డిపోగా చెందినదిగా గుర్తించారు.

కాగా, ఇన్ ఫార్మర్ నెపంతో ఒక కానిస్టేబుల్ ను మావోలు ప్రయాణికుల ఎదుటే కాల్చి చంపినట్టు సమాచారం. అనంతరం తమ జోలికి వస్తే పెద్ద ఎత్తున దాడులకు తెగబడుతామంటూ మావోలు నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. హెచ్చరికలతో కూడిన ఓ ఎరుపు బ్యానర్ ను వారు ప్రదర్శించినట్టు ప్రయాణికులు చెబుతున్నారు.
అర్థరాత్రి జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపుకు తరలించారు. ప్రస్తుతం అక్కడి పరిసర ప్రాంతాల్లో భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications