తాజ్ హోటల్ సమీపంలో అగ్నిప్రమాదం .. ఒకరి మృతి ...
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అగ్నిప్రమాదం జరిగింది. చారిత్రిక తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సమీపంలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. సమీంపలోని ఓ నాలుగు అంతస్తుల నివాస సముదాయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. మరో 14 మందిని కాపాడినట్టు వివరించారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని .. విచారణ జరుపుతున్నామని తెలిపారు.
చెలరేగిన మంటలు
ఆదివారం మధ్యాహ్నం 12.17 గంటలకు మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో శ్యామ్ అయ్యర్ అనే స్థానికుడు చనిపోయాడు. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటననే 14 మందిని సురక్షితంగా కాపాడినట్టు పోలీసు అధికారులు తెలిపారు. మంటలు చెలరేగి పొగ కమ్ముకొందని .. దీంతో కొందరు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని వైద్యులు తెలిపారు.

భవనంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదని .. ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మరోవైపు సంఘటనాస్థలానికి నాలుగు ఫైరింజన్లు చేరుకొని .. మంటలను ఆర్పివేశాయి.












Click it and Unblock the Notifications