జమ్మూకు వెళ్తుండగా.. 10మంది బీఎస్ఎఫ్ జవాన్లు అదృశ్యం
ముఘల్‌సరాయ్: సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)కు చెందిన పది మంది సైనికులు అదృశ్యమయ్యారు. 83మంది సైనికులు ప్రత్యేక రైల్లో పశ్చిమబెంగాల్ నుంచి జమ్మూకు ప్రయాణిస్తుండగా అందులో 10మంది కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు.
ఈ మేరకు ఆ సైనికుల కమాండర్ ఉత్తరప్రదేశ్‌లోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నగర్ రైల్వే స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పది మంది జవాన్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కనిపించకుండా పోయారని కమాండర్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

జవాన్లు కనిపించకుండా పోయినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని భర్థమాన్ నుంచి బీహార్‌లోని ధన్‌బాద్ మధ్యలో వారు ఎక్కడో అదృశ్యమయ్యారని ఎస్ఐ జితేంద్ర కుమార్ తెలిపారు.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయనగర్ రైల్వే స్టేషన్ వద్ద కమాండర్ సైనికులను హాజరు తీసుకోగా, పది మంది అదృశ్యమైనట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications