10కోట్ల విలువైన తిమింగలం వాంతి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్; తిమింగలం వాంతికింత డిమాండ్ ఎందుకంటే..
అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత విలువైన 10 కోట్ల విలువ చేసే తిమింగలం వాంతిని లక్నో పోలీసులు సీజ్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో తిమింగలం వాంతి అక్రమ రవాణా చేస్తున్న ముఠాలోని నలుగురు సభ్యులను ఉత్తర ప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడి చేసి పట్టుకుంది. ఈ దాడిలో వారి వద్ద నుండి 4.12 కిలోగ్రాముల తిమింగలం వాంతిని గుర్తించింది, దీని విలువ ₹ 10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తిమింగలం వాంతి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
1972 వన్యప్రాణుల (రక్షణ) చట్టం తిమింగలం వాంతిని విక్రయించడాన్ని నిషేధిస్తుందని, దీనిని విక్రయించటం స్మగ్లింగ్ గా పరిగణించబడుతుంది అని చెబుతున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిషేధించబడిన తిమింగలం వాంతి స్మగ్లింగ్‌లో పాల్గొన్న ముఠాలోని నలుగురు సభ్యులను లక్నోలోని గోమతీనగర్ ఎక్స్‌టెన్షన్ ఏరియా నుండి అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులను ఫిరోజ్, అవినాష్, డానిష్, అభయ్ లుగా గుర్తించారు.

తిమింగలం వాంతి బంగారం కన్నా ఖరీదు.. అందుకే స్మగ్లింగ్
స్పెర్మ్ తిమింగలాలు "వేల్ వామిట్" ను చేసుకుంటాయి, దీనిని "గ్రే అంబర్" మరియు "ఫ్లోటింగ్ గోల్డ్" అని కూడా పిలుస్తారు. దీనిని ప్రపంచంలోని విచిత్రమైన సహజ సంఘటనలలో ఒకటిగా సూచిస్తారు. ఈ "ఫ్లోటింగ్ గోల్డ్" స్మగ్లింగ్ చేస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేయడం అసాధారణమైన సంఘటన కాదు. ఈ ఏడాది ఇప్పటికే అనేక సంఘటనలలో తిమింగలం వాంతిని అక్రమంగా రవాణా చేస్తున్న పలువురిని పట్టుకున్నారు. తిమింగలం వాంతి బంగారం కన్నా ఖరీదు కావడంతో దీనిని అక్రమ రవాణా చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

తిమింగలం వాంతి సౌందర్య సాధనాలు, మందులలో వాడతారు
అయితే ఈ ఏడాది జూలైలో, కేరళలోని మత్స్యకారుల బృందం 28 కోట్ల రూపాయల విలువైన తిమింగలం వాంతిని గుర్తించినట్లు నివేదించబడింది . అయితే వారు దానిని స్థానిక అధికారులకు అందించారు. ఈ వార్త వైరల్ కావడంతో, వారు దీనికి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు. తిమింగలం వాంతి స్పెర్మ్ వేల్స్ యొక్క జీర్ణవ్యవస్థలో ఉత్పత్తి అవుతుంది. ఇది తిమింగలం యొక్క ప్రేగులలో తయారైన మైనపు, ఘన, మండే పదార్థం అని చెబుతున్నారు. దీనిని సౌందర్య సాధనాలు మరియు మందులలో ఉపయోగిస్తారు.

ఒక కిలో తిమింగలం వాంతి కోటి రూపాయలు
పురాతన కాలం నుండి, తిమింగలం వాంతిని సువాసనలు మరియు అత్యాధునిక పరిమళ ద్రవ్యాలలో, అలాగే వివిధ సాంప్రదాయ ఔషధాలలో ఉపయోగిస్తారు. అందుకే దీనిని చాలా ఎక్కువ ధరకు విక్రయిస్తారు. గత సంవత్సరం ముంబై పోలీసులు ఇచ్చిన అంచనాల ప్రకారం, 1 కిలో తిమింగలం వాంతి విలువ 1 కోటి రూపాయలు . ఈ కారణంగా, సముద్రంలో ఈ విసర్జనను " ఫ్లోటింగ్ గోల్డ్"గా సూచిస్తారు. ఈజిప్షియన్లు దీనిని ధూపం వలె ఉపయోగిస్తారు. చైనీయులు దీని డ్రాగన్ స్పిటిల్ సెంట్ గా వ్యవహరిస్తుంటారు.












Click it and Unblock the Notifications