మరో భారీ ఎన్‌కౌంటర్: 10 మంది మావోయిస్టులు మృతి
నారాయణ్‌పూర్: సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కాంకేర్, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళలతో సహా 10 మంది నక్సల్స్ మృతి చెందారు.
మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్‌మేట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మకాం వేశారని నిఘావర్గాల ద్వారా సమాచారం అందటంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్‌జీ దళాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. సోమవారం రాత్రి నుంచే సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా మంగళవారం ఉదయం నక్సల్స్ ఉన్న అబూజ్మాడ్ ప్రాంతానికి చేరుకున్నాయి. వీరిని చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.

ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు పది మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. మరికొందరు నక్సల్స్ పరారయ్యారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. కాగా, ఘటనాస్థలం నుంచి ఏకే-47 రైఫిల్, పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
అబూజ్మాడ్ ఎన్‌కౌంటర్‌లో విజయం సాధించిన భద్రతా బలగాలను ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్ శర్మ అభినందించారు. నక్సలైట్లను లొంగిపోవాలని కోరారు విజయ్ శర్మ. మావోయిస్టులు హింస మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌సాయ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని కోరుకుంటోందని తెలిపారు. చర్చలు జరిపేందుకు సిద్దమని చెప్పారు.
కాగా, తాజా ఘటనతో కాంకేర్, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 88 మంది నక్సలైట్లు మరణించారు. ఇటీవల కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. వీరిలో ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నారు. కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్ పరిధి కల్పర్ అడవిలో జరిగిన ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి. పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications