జియోకు షాక్: రూ.2లకే సూపర్‌ఫాస్ట్ డేటా, పెండింగ్‌లో ధరఖాస్తులు
రిలయన్స్ జియో ప్రత్యర్థి టెలికం కంపెనీలకు షాకిస్తే.. బెంగుళూరుకు చెందిన ఓ స్టార్టప్ జియోకు షాకిచ్చే ఆఫర్‌ను తెచ్చింది. రూ.2 ఇస్తే చాలు సూపర్ పాస్ట్ డేటాను ఇస్తామని ప్రకటించింది.
Recommended Video

బెంగుళూరు: రిలయన్స్ జియో ప్రత్యర్థి టెలికం కంపెనీలకు షాకిస్తే.. బెంగుళూరుకు చెందిన ఓ స్టార్టప్ జియోకు షాకిచ్చే ఆఫర్‌ను తెచ్చింది. రూ.2 ఇస్తే చాలు సూపర్ పాస్ట్ డేటాను ఇస్తామని ప్రకటించింది.
ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటాలతో రిలయన్స్ జియో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపించింది. అంతేకాదు జియో మార్గంలోనే ఇతర టెలికం కంపెనీలు కూడ నడవాల్సిన పరిస్థితులు కూడ అనివార్య పరిస్థితులను కల్పించింది జియో.
డేటా, వాయిస్ కాల్స్ తో పాటు ఫీచర్ ఫోన్ పేరుతో అతి చౌకగా ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది జియో. అయితే జియో బాటలోనే ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్‌లు కూడ కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి.

రూ.2 లకే సూర్ ఫాస్ట్ డేటా
బెంగళూరు నగరంలో ఐఎస్‌పీ లైసెన్స్‌తో ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా డేటా సేవలు అందిస్తున్న వైఫై డబ్బా జియో ప్లాన్లతో పోలిస్తే ఇప్పటికే భారీగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రీ పెయిడ్ కస్టమర్లకు సరసమైన ధరల్లో డేటా ప్లాన్లను ఆఫర్ చేస్తోంది.కేవలం రూ.2లకే 100 ఎంబీ డేటా ఆఫర్ చేస్తోంది. అలాగే రూ.10లకే 500ఎంబీ, రూ.20లకు 1 జీబీ డేటా అందిస్తోంది.మరో వైపు జియో రూ.19 లపై 150 ఎంబీ అందిస్తోంది.

రౌటర్ ద్వారా వైఫై సేవలు
లక్షలు ఖర్చుపెట్టి సెల్ టవర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా రూ. 4వేలతో రౌటర్ ద్వారా తమ సేవలను విస్తరిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో అతి వేగవంతమైన డేటా అందించడమే తమ లక్ష్యమని వైఫై డబ్బా ఫౌండర్ శర్మ చెబుతున్నారు. వంద నుంచి 200మీటర్ల పరిధిలో 50బీపీఎస్‌తో రిలయబుల్ సేవల్ని అందిస్తున్నట్టు తెలిపారు.

బెంగుళూరులో 350 రౌటర్లు ఏర్పాటు
ఇప్పటికే బెంగళూరు నగరంలో 350 రౌటర్లను ఏర్పాటు చేశారు. ఈ రౌటర్ల ద్వారా వినియోగదారులకు సేవలను అందిస్తున్నారు. ఇంకా 1800 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం స్థానిక్ కేబుల్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో ఈ సేవలను అందిస్తున్నారు.

కొత్త కనెక్షన్ కోసం వారం రోజులు
కొత్త కనెక్షన్ ఇవ్వాలంటే వారం రోజుల సమయం తీసుకొంటున్నారు. అయితే రానున్న రోజుల్లో కొత్త కనెక్షన్ ఇవ్వడానికి 4 రోజుల సమయాన్ని మాత్రం తీసుకొనేలా వ్యూహన్ని రూపొందిస్తున్నట్టు డబ్బా పౌండర్ శర్మ చెబుతున్నారు.రాబోయే 3-4 ఏళ్లలో లక్షల వైఫై డబ్బాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు. కాగా వైఫై డబ్బాకి ప్రస్తుతం వై కాంబినేటర్ సహా కొన్ని సంస్థలు ఇన్వెస్టర్లుగా ఉన్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications